Shiva Abhishekam For Marriage

Shiva Abhishekam For Marriage

Shivudu: ఈ శివయ్యకి అభిషేకం చేస్తే కచ్చితంగా పెళ్లి అవుతుందట!

విశాఖ జిల్లాలో ప్రముఖ శివాలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అన్ని శివాలయాలు శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు అవుతున్నాయి. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ గ్రామంలో వెలసిన శివాలయంకి ఓ ప్రత్యేకత వుంది. ఇక్కడ మహాశివరాత్రి మూడు రోజులు లక్షలాది భక్తులతో కళ్యాణపులోవ రిజర్వాయర్ అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఓ రిజర్వాయర్ ఉంటుంది.

అది రైతులకు పంట పొలాలకు నీళ్లు, భక్తులకు స్నానాలు చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రిజర్వాయర్ లో స్నానం ఆచరించి కళ్యాణపులోవలో రిజర్వాయర్ పక్కనే ఉన్న శ్రీ కళ్యాణ పోతురాజు బాబు దేవాలయంలో శివయ్యకి పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ శివయ్యకి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడ శివయ్య కళ్యాణ పోతురాజుగా వెలిశారు. భక్తులందరూ శివయ్యను దర్శించుకుంటే పెళ్లి అవ్వని వారికి పెళ్లిళ్లు అవుతాయని భక్తులు విశ్వాసం.

పిల్లలు లేని వారికి కూడా ఇక్కడికి వచ్చి పక్కనే ఉన్న పెద్దింటి అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలు పుడతారని అర్చకులు శర్మ తెలిపారు. ఈ నమ్మకం తో ప్రతి ఏటా ఇక్కడ మహా శివరాత్రి సమయంలో లక్షల్లో యాత్రికులు వచ్చి ఈ రిజర్వాయర్‌ లో స్నానం ఆచరించి, సమీపంలో వున్న శివయ్యని సందర్శిస్తారు. ప్రతి ఏటా శివరాత్రి సమయంలో మూడు రోజులు పాటు.. యాత్రికుల కోసం విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తుని వంటి ప్రాంతాల నుండి రిజర్వాయర్‌కు బస్సులు ఉంటాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి