SBI festive season offer zero processing fee on car loans

SBI festive season offer zero processing fee on car loans

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా అదిరే శుభవార్త అందించింది. కస్టమర్ల కోసం పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. పండుగకు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. లోన్ (Loan) తీసుకొని కారు కొంటే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కల్పిస్తున్నట్లు బ్యాంక్ (Bank) వెల్లడించింది. ఈ ఆఫర్ 2024 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. అమేజింగ్ కారు లోన్ డీల్స్ పొందొచ్చని తెలిపింది. కారు లోన్ తీసుకుంటే వచ్చే ఏడాది జనవరి చివరి వరకు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ పొందొచ్చని వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ ఆటో లోన్స్‌పై ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును వసూలు చేస్తోంది. 8.55 శాతం వడ్డీ రేటుతో మీరు ఎస్‌బీఐ నుంచి లోన్ పొందొచ్చు. అయితే దీనికి ప్రీమియం వంటివి జత అవుతాయి. అప్పుడు కారు లోన్ వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 9.7 శాతం వరకు వడ్డీ రేటుతో పొందొచ్చు. అలాగే టెన్యూర్ ఐదేళ్లకు పై ఉంటే వడ్డీ రేటు ఎక్కువగా ఉండొచ్చు.

అలాగే క్రెడిట్ స్కోర్ ఆధారంగా కూడా వడ్డీ రేటు మారుతుంది. 3 నుంచి ఐదేళ్ల టెన్యూర్ అయితే సిబిల్ స్కోర్ 775లేదా ఆపైన ఉంటే వడ్డీ రకేటు 8.8 శాతంగా పడుతుంది. అదే వడ్డీ రేటు 757 నుంచి 774 వరకు ఉంటే వడ్డీ రేటు 8.9 శాతంగా, సిబిల్ స్కోర్ 721 నుంచి 756 వరకు ఉంటే 9.15 శాతం, 700 నుంచి 720 వరకు ఉంటే 9.4 శాతం, 650 నుంచి 699 వరకు ఉంటే 9.6 శాతం చొప్పున వడ్డీ రేటు పడుతుంది.

అదే ఐదేళ్లకు పైన టెన్యూర్ అయితే కారు లోన్‌పై వడ్డీ రేటు 8.9 శాతం నుంచి 9.7 శాతం వరకు పడుతుంది. అలాగే కారు లోన్స్‌పై ప్రిపేమెంట్ చార్జీలు, ఫోర్‌క్లోజర్ చార్జీలు వంటివి కూడా ఉండవు. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కారు లోన్ పొందొచ్చు. ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్,2 ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, శాలరీ స్లిప్ లేదా ఫామ్ 16 లేదా రెండేళ్ల ఐటీఆర్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి