Adilabad A Rare Achievement At A Very Young Age Do You Know what This Boy Has Achieved Details

Adilabad A Rare Achievement At A Very Young Age Do You Know what This Boy Has Achieved Details

కొందరు చిన్న పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. వారు చెప్పే మాటలు వింటుంటే సంతోషం కలుగుతుంది. అడిగిన ప్రశ్నలకు వచ్చి రాని భాషలో తడుముకోకుండా సమాధానాలు చెబుతుంటే విని మురిసిపోతారు. మరి కొందరు చిన్నారులు ఎవరైనా ఏదైనా ఒకసారి చెబితే చాలు జ్జాపకం ఉంచుకొని టకా టకా అప్పజెబుతారు. ఇంకా కొందరైతే దేశాలు, రాజధానులు, ప్రదేశాల పేర్లు ఇలా అడిగిన వెంటనే టక్కున సమాధానాలు చెప్పి అబ్బుర పరుస్తారు. చిరు ప్రాయంలోనే అపర మేధస్సును ప్రదర్శించి ఇప్పటికే ఎందరో చిన్నారులు అరుదైన ఘనత సాధించిన వారు ఉన్నారు. వారి కోవలోకే ఆదిలాబాద్‌కు చెందిన రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసున్న అద్వైరుషి చెందుతారు. అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డును సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. అసలుఆ బాలుడు సాధించిన ఘనత ఏమిటి, ఎందుకు అందరు ఆ చిన్నారిని అభినందిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి.

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాజమోహన్ సునీత దంపతుల కూతురు కీర్తి. ఆమె భర్త డా. నటరాజ్. వీరి కుమారుడే అద్వై రుషి. వయసు రెండు సంవత్సరాల నాలుగు నెలలు. ప్రపంచంలోని అత్యధిక మేధస్సు కలిగిన చిన్నారులలో ఒకరై, జిల్లాకు పేరు ప్రఖ్యాతలు సాధించి నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థ నుంచి youngest toddler with high memory power అనే టైటిల్ ను సాధించారు. ముఖ్యంగా ఈ అవార్డు సాధించడానికి కారణం రెండున్నర సంవత్సరాలలోపు లోనే పెద్ద పిల్లలు కూడా పరిష్కరించలేనటువంటి పజిల్స్ ను సెకండ్ల వ్యవధిలో సాధిస్తూ, అదేవిధంగా ఇంగ్లీష్ అక్షరాలు, సంఖ్యలు, పండ్లు, కూరగాయలు, రంగులు, ఆకారాలు, జంతువులు వాహనాలు శరీర భాగాలు అన్ని చెప్పగలగే సామర్థ్యం కలిగి ఉండటం. ఈ సామర్ధ్యం వల్లే ఈ అవార్డు సాధించినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

అయితే అతి చిన్న వయసులో ఈ అవార్డును సాధించినందుకు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చిన్నారిని తల్లిదండ్రులను అభినందించారు. జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రికార్డ్ సర్టిఫికెట్, మెడల్ ను ఆ చిన్నారి తోపాటు తల్లి కీర్తి, తాత రాజ్ మొహన్ స్వీకరించారు. అతిచిన్న వయసులో ప్రపంచ రికార్డును సాధించిన అద్వైరుషిని అందరు అభినందిస్తున్నారు.

 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి