cm ys jagan has virtually inaugurated five new medical education colleges in ap

cm ys jagan has virtually inaugurated five new medical education colleges in ap

1.ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరో ఐదు ప్రభుత్వ నూతన మెడికల్‌ కాలేజీలను ప్రారంభించింది. శుక్రవారం విజయనగరం పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభించారు.

2.రాష్ట్రంలో అనారోగ్య సమస్యలు తలెత్తకూడదని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 17నూతన మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఐదు కాలేజీలను ప్రారంభించారు. వీటి నిర్మాణం కోసం సుమారు 8,480కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

3.విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ మొదట విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైఎస్ఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కాలేజీని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సందర్శించారు.

4.అటుపై మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిలో నిర్మించిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఈ ఐదు కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. వచ్చే ఏడాది మరో 5మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు.

5.మచిలీపట్నంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పాటు అక్కడ యూజీసీ బ్లాక్ భవనం, ల్యాబ్ కోసం నిర్మించిన భవనాలను ఫోటో గ్యాలరీలో చూశారు సీఎం జగన్. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు జగన్.

6.ఏలూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం ప్రారంభించారు. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే అకడమిక్ క్లాసులు ప్రారంభం అవుతాయని సీఎం తెలిపారు.

7.వచ్చే ఏడాది మరో 5మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని..ఆ మరుసటి సంవత్సరం మరో ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో 11మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని..వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 17కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

8.రాజమహేంద్రవరం లో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు ఏకకాలంలో 2023-24 విద్యా సంవత్సరానికి 5 నూతన కాలేజీలను ప్రారంభించడం గొప్ప విషయమని తెలిపారు సీఎం.

9.ఇప్పటికే 2158 ఎంబీబీఎస్‌ సీట్లకు అదనంగా మరికొన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీల ప్రారంభంతో అదనంగా మరో 2550 ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుతాయన్నారు. పీజీ సీట్ల సంఖ్య కూడా నాలుగేళ్లలో 966నుంచి 1767కి పెంచినట్లుగా తెలిపారు.

10.వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అద్భుతమైన కార్యక్రమాల గురించి జగన్ విజయనగరంలో వెల్లడించారు. సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ప్రజలకు ఉచితంగా అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం తెలిపింది.

11.2024-25 ఏడాదిలో మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆధోని, మదనపల్లెలో ప్రారంభించనుంది ప్రభుత్వం. వీటి ద్వారా వైద్య, ఆరోగ్యరంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఏపీని దిక్సూచిగా నిలుస్తుందన్నారు.

 

12.అదే విధంగా 2025-26 సంవత్సరంలో మరో 7మెడికల్ కాలేజీలు ప్రారంభించనుంది ప్రభుత్వం. వాటిని పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ల, పెనుకొండలో నిర్మించనుంది.

13.అలాగే గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి.సీతంపేట, రంపచోడవరం,పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నారు. వీటితో పాసు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, తిరుపతిలో శ్రీపద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, కడపలో మానసిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తోంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి