Record Views For Ap CM Ys Jagan Interview

Record Views For Ap CM Ys Jagan Interview

YS Jagan: జగన్ ప్రభంజనం.. జనాల్లో భారీ ఫాలోయింగ్‌కు ఇదే నిదర్శనం, దెబ్బకు కూటమి ఖల్లాస్!

సునామీ వస్తే ఎలా ఉంటుంది? తుఫాన్ ముందు నిశబ్ధంలా.. జగన్ రావడం ఖాయమా..? ఏపీ ఎన్నికల్లో జగన్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారా..? కనీవినీ ఎరుగని రీతిలో.. ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా.. జగన్ ప్రభంజనం సృష్టిస్తూ.. అంచనాలకు మించి, ఎవ్వరూ ఊహించని రేంజ్‌లో సీట్లు సాధించబోతున్నారా? ఇప్పుడు ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తోంది. సీఎం వైయస్ జగన్ తాజా ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ - 9లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.

జనంలో జగన్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రజల్లో ఆయన మాస్ ఫాలోయింగ్‌ చూస్తే మతిపోవాల్సిందే. యూట్యూబ్‌లో కూడా యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది. అందులో అభివృద్ధి, సంక్షేమం… వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ - 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి…టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు… సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి…తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు రెండో సారి చేస్తే గ్రహపాటు మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోపాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు.. పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు..లక్షల్లో షేర్లు, లైక్స్, కామెంట్స్ తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.

మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు.. చూసేవాళ్ళు కరువయ్యారు అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్  దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని వాటిల్లో నిబద్ధత లేదని…అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు. ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఎబిఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఈమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి