amazing policy from LIC Lots of benefits in this scheme

amazing policy from LIC Lots of benefits in this scheme

LIC నుంచి మరో అదిరిపోయే పాలసీ.. ఈ స్కీమ్‌లో బోలెడన్ని బెనిఫిట్స్

భారతీయ జీవిత బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (LIC) ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మెరుగైన, ప్రజాకర్షణ చూరగొనే పాలసీస్ అందుబాటులోకి తీసుకొస్తోంది ఎల్ఐసీ. ఇందులో భాగంగానే ఇప్పుడు జీవన్‌ ధార 2 (LIC Jeevan Dhara 2) ప్లాన్‌ను మార్కెట్లోకి తెచ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌. మరి ఈ పాలసీకి సంబంధించిన వివరాలు చూద్దామా.

 

ఇది వ్యక్తిగత, సేవింగ్స్‌, డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస ఎంట్రీ వయసు 20 సంవత్సరాలుగా నిర్దారించారు. గరిష్ఠ ఎంట్రీ వయసు 80, 70, 65 సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఇది రాబోయే సోమవారం (జనవరి 22) నుండి అందుబాటులోకి వస్తోంది. ప్రారంభం నుంచే యాన్యుటీకి అనుమతించడం ఈ పాలసీలో ప్రత్యేకత. ఇందులో మొత్తం 11 యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వయసును బట్టి యాన్యుటీ రేట్లు ఉంటాయి. వయసు పెరిగినా కొద్ది అధిక యాన్యుటీ రేట్లు అందుకోవచ్చు. అధిక ప్రీమియంలకు ప్రోత్సాహకాలు కూడా అందుతాయి.

 

రెగ్యులర్‌ ప్రీమియం, సింగిల్‌ ప్రీమియం అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్‌ ప్రీమియం కాలపరిమితి 5-15 సంవత్సరాలు. సింగిల్‌ ప్రీమియంలో కాలపరిమితి 1-15 సంవత్సరాలు ఉంటుంది. డిఫర్‌మెంట్‌ సమయంలో కూడా జీవిత బీమా కవరేజీ కూడా అందిస్తారు. డిఫర్‌మెంట్‌ అంటే ఇక్కడ పాలసీదారుడు ఎంచుకున్న మేరకు భవిష్యత్తులో బీమా పాలసీ ప్రయోజనాలు అందుకునేందుకు నిర్దేశించుకున్న సమయం అని అర్థం. డిఫర్‌మెంట్‌ సమయంలోను, ఆ తర్వాత కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది.కాగా.. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో ఎల్‌ఐసీ షేర్లలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం LIC షేరు BSE, NSE లలో 930 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ షేరు ధర 1000 రూపాయలు దాటొచ్చని ట్రేడ్ పండిస్తులు చెబుతున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి