Andhra Pradesh Government To Start Free Laptop Scheme 2024

Andhra Pradesh Government To Start Free Laptop Scheme 2024

ఉచితంగా ల్యాప్‌టాప్.. పొందాలంటే ఇలా దరఖాస్తు చేసుకోండి

Free Laptop: ల్యాప్‌టాప్‌ల ధరలు దాదాపు డబుల్ అయ్యాయి. ఒకప్పుడు రూ.25వేలకే లభించే ల్యాప్ టాప్, ఇప్పుడు దాదాపు రూ.40వేలు ఉంటోంది. మరి రూ.30వేల విలువైన ల్యాప్‌టాప్ ఉచితంగా పొందాలంటే ఏం చెయ్యాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Free Laptop: ల్యాప్‌టాప్‌ల ధరలు దాదాపు డబుల్ అయ్యాయి. ఒకప్పుడు రూ.25వేలకే లభించే ల్యాప్ టాప్, ఇప్పుడు దాదాపు రూ.40వేలు ఉంటోంది. మరి రూ.30వేల విలువైన ల్యాప్‌టాప్ ఉచితంగా పొందాలంటే ఏం చెయ్యాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2024ని తెచ్చింది. దీని ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ ఇవ్వాలి అనుకుంటోంది. అందుకోసం వారు దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులైన, పీజీ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ ల్యాప్‌టాప్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ http://apdascac.ap.gov.in లో ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువగా ఉన్న విద్యార్థి ఉచిత ల్యాప్‌టాప్ పొందగలరు. అలాగే.. తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటే, అలాంటి విద్యార్థులు సగం ధర చెల్లించి ల్యాప్‌టాప్ పొందగలరు. అదే తల్లిదండ్రుల ఆదాయం నెలకు రూ.20వేల కంటే ఎక్కువ ఉంటే, ల్యాప్‌టాప్ కోసం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ల్యాప్‌టాప్ కోసం అప్లై చేసుకోవడానికి సదారెమ్ సర్టిఫికెట్ (Sadarem certificate), పాస్‌పోర్ట్ సైజు ఫొటో, తల్లిదండ్రుల ఆదాయ సర్టిఫికెట్, మొబైల్ నంబర్, స్కూల్/కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు అవసరం.

దివ్యాంగులై, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం రూ.30,0000 విలువైన ల్యాప్‌టాప్ ఇవ్వనుంది. ఈ ల్యాప్‌టాప్‌లను దివ్యాంగుల సంక్షేమ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పంపిణీ చేస్తారు. లేదా ఏపీ దివ్యాంగ సీనియర్ సిటిజన్ అసిస్టెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పంపిణీ చేస్తారు.

ఈ పథకం కోసం అప్లై చేసుకోవడానికి http://apdascac.ap.gov.in కి వెళ్లాలి. అక్కడ “online application” ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. ఆ తర్వాత “click here to apply for the differently-abled scheme” క్లిక్ చెయ్యండి. ఇప్పుడు “Application for Sanction of Laptops” ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత “Apply online” ఆప్షన్ క్లిక్ చెయ్యండి. మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి కొత్త పాస్‌వర్డ్ ని 2 సార్లు టైప్ చెయ్యాలి. సబ్‌మిట్ కొట్టాక, మీకు ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది. వాటితో మీరు లాగిన్ అవ్వాలి. ఇందుకోసం apply online ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఉచిత ల్యాప్ టాప్ కోసం ఫారమ్ ఫిలప్ చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చెయ్యాలి. సబ్‌మిట్ కొడితే.. మీరు దరఖాస్తు చేసుకున్నట్లే.

మీరు ఆన్‌లైన్ బదులు.. ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, నింపి, దానికి అవసరమైన పత్రాలను కలిపి, ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ, సీనియర్ సిటిజన్ అసిస్టెన్స్ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఇవ్వొచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇచ్చే వివరాలన్నీ వాస్తవం అయివుండాలి. లేదంటే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని ప్రభుత్వం తెలిపింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి