Temperature Increase Day By Day In Telangana And Andhra Pradesh Says IMD Weather Official

Temperature Increase Day By Day In Telangana And Andhra Pradesh Says IMD Weather Official

Weather Report: తెలుగు రాష్ట్రాలకు IMD హెచ్చరిక.. నేటి వాతావరణ రిపోర్ట్

Andhra Pradesh and Telangana Weather Report: భారత వాతావరణ విభాగం తాజా వాతావరణ బులిటెన్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజులు తీవ్రమైన ఎండలు ఉంటాయి అని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటిందని వివరించారు. ఇవాళ్టి నుంచి 5 రోజులపాటూ ఉష్ణోగ్రత 38 డిగ్రీల దాకా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా వేడి బాగా పెరుగుతుందని వివరించారు. దీనికి కారణం ఎల్‌నినో అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం సోమవారం నుంచి 3 రోజులపాటూ.. రాయలసీమలో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. నిన్న దేశంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కర్నూలులో నమోదైంది. దీన్ని బట్టీ, రాయలసీమలో వేడి ఎంతలా పెరుగుతోందో మనం అర్థం చేసుకోవచ్చు.

శాటిలైట్ వర్షపాత అంచనాల ప్రకారం చూస్తే, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణలో మేఘాలు వచ్చిపోతూ ఉంటాయి. అయితే అవి బలంగా ఉండవు. అందువల్ల వేడి ఫీలింగ్ ఉంటుంది. రాత్రి 10 తర్వాత పశ్చిమ రాయలసీమ, తెలంగాణ అంతటా మేఘాలు ఉంటాయి.

గాలిని గమనిస్తే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఓ సుడి లాంటిది ఏర్పడుతోంది. అలాగే.. విశాఖ పక్కన కూడా ఓ సుడి ఉంది. కానీ ఇవి ఇంకా మేఘాలను సృష్టించలేదు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 12 నుంచి 24 కిలోమీటర్లగా ఉంటుంది. ఏపీలో గంటకు 9 నుంచి 15 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 5 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో ఇవాళ గాలి వీస్తుంది.

ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి మినిమం 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఏపీలో కూడా అంతే నమోదైంది. తెలంగాణలో ఇవాళ పగలు మాగ్జిమం 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాత్రం మాగ్జిమం 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో కొంత తక్కువగా ఉండటానికి కారణం మేఘాలే.

తేమ అన్నది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, కదిరి, హిందూపురం, ఆధోని, గుంతకల్, ప్రొద్దుటూరు, రాయచోటి, మదనపల్లెలో వేడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ ఎండల నుంచి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి