Google Launches New AI Google Gemini Click Here For Full Details

 Google Launches New AI Google Gemini Click Here For Full Details

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ గూగుల్ సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెజెన్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది గూగుల్‌. 'గూగుల్ జెమిని' పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను పరిచయం చేసింది. కృత్రిమే మేథాలో అడ్వాన్స్‌డ్‌ మోడల్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. ఇంతకీ గూగుల్‌ జెమిని ఎన్ని...

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఇక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ సరికొత్త టెక్నాలజీ భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. అందుకు అనుగుణంగానే బడా టెక్‌ కంపెనీలన్నీ ఈ టెక్నాలజీని ఫాలో అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ మొదలు పలు టెక్‌ దిగ్గజాలన్నీ ఏఐ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థ గూగుల్ సైతం ఆర్టిఫిషియల్‌ ఇంటెజెన్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది గూగుల్‌. ‘గూగుల్ జెమిని’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను పరిచయం చేసింది. కృత్రిమే మేథాలో అడ్వాన్స్‌డ్‌ మోడల్‌ను తీసుకొచ్చినట్లు గూగుల్‌ తెలిపింది. ఇంతకీ గూగుల్‌ జెమిని ఎన్ని వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.? అసలు దీని ఉపయోగాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో చివరికి కోడింగ్‌ వంటి రకరకాల సమాచారాశాన్ని 90 శాతం కచ్చితత్వంతో అందిస్తుందీ గూగుల్‌ జెమిని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్ కేవలం డేటా సెంటర్స్‌, ఆఫీసులకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణ మొబైల్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ప్రస్తుతం కేవలం ఇంగ్లిష్‌లోనే అందుబాటులోకి వచ్చిన గూగుల్‌ జెమినిని త్వరలోనే ఇతర అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఇకపై గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌసర్ వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గూగుల్‌ జెమినిని మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

జెమిని నానో..

ఈ టెక్నాలజీ మొబైల్ డివైజ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టెక్నాలజీ గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌లో పనిచేయనుంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ టెక్నాలజీని గూగుల్ పిక్సెల్‌ 8 ఫోన్‌లో తీసుకురానున్నారు. దీంతో ఆఫ్‌లైన్‌లో ఛాట్ జీపీటీ వంటి సేవలను పొందొచ్చు.

జెమిని ప్రో..

గూగుల్ ఇప్పటికే తీసుకొచ్చిన బార్డ్‌ ఏఐ సేవలకు జెమిని ప్రో అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ అని చెబుతున్నారు. డిసెంబర్ 13 నుంచి అందుబాటులోకి రానున్న ఈ సేవల ద్వారా యూజర్లు వేగంగా, కచ్చితమైన సమాచారాన్ని పొందొచ్చు.

జెమిని అల్ట్రా..

కార్పొరేట్‌ సంస్థల అవసరాల కోసం ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది గూగుల్‌. పైథాన్‌, జావా వంటి కోడింగ్‌ లాంగ్వేజ్‌లను అర్థం చేసుకొని కస్టమర్లకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి