Amazon Launched Fire Tv Stick 4k

Amazon Launched Fire Tv Stick 4k

Amazon fire tv stick: 100% వినోదం గ్యారంటీ.. అమెజాన్ నుంచి కొత్త ఫైర్ స్టిక్.. ఫీచర్లు సూపరంతే..

అమెజాన్ నుంచి మరో కొత్త ఆవిష్కరణ మార్కెట్లోకి వచ్చింది. ప్రజలకు వినోదం అందించడమే ప్రధాన లక్ష్యంగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కేను దేశంలోని విడుదల చేసింది. పాత జనరేషన్లతో పోల్చితే దీనిలో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా టీవీలకు మరింత స్మార్ట్ గా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ స్టిక్ గురించి, దానిలో ఫీచర్లు, ధర, ఇతర వివరాలు తెలుసుకుందాం.

చాలా సులువు

గతంలో పాతకాలపు టీవీ అంటే కేబుల్ కనెక్షన్ తప్పనిసరిగా కావాలి. దానికోసం ఆపరేటర్లను కలిపి, కనెక్షన్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద పనిగా ఉండేది. ఇప్పుడు అంతా చాలా సులువుగా మారింది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే తదితర వాటితో మనం టీవీలో అన్ని రకాల ప్రోగ్రామ్ లను చూడవచ్చు. వినోదం, క్రైం, సినిమాలు, టీవీ షోస్ తదితర అనేక వాటిని వీక్షించవచ్చు.

ధర కేవలం రూ.5,999

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే దేశంలో మే 13 నుంచి అందుబాటులో ఉంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ లోని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో వినియోగదారులకు దొరుకుతుంది. అమెజాన్.ఇన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధర కేవలం రూ.5,999 మాత్రమే.

వేగవంతమైన స్ట్రీమింగ్

వేగవంతమైన 4కే స్ట్రీమింగ్, అంతరాయం లేని ప్రసారం, వేగంగా యాప్ లను ఎనేబుల్ చేసే సామర్థ్యం దీని ప్రత్యేకత. అల్ట్రా హెచ్ డీ పిక్చర్ క్వాలిటీ, డాల్బీ విజన్, హెచ్ డీఆర్10+, డాల్బీ అట్మోస్ ఆడియోతో 4కే కంటెంట్‌ వేగంగా స్ట్రీమింగ్ అవుతుంది. దేశంలోని ఫైర్ టీవీ పరికరాలలో శక్తివంతమైన స్ట్రీమింగ్ స్టిక్‌గా దీనిని చెప్పవచ్చు. గతంలో విడుదలైన వేరియంట్ల కంటే దాదాపు 30 శాతం ఎక్కువ ఫీచర్లతో లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చింది.

ఓటీటీలకు యాక్సెస్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారాలపై ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా వంటి వాటిని చూడవచ్చు. 12,000+ యాప్‌ల ద్వారా మిలియన్ సినిమాలు, టీవీ షో ఎపిసోడ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వీటితో పాటు మినీ టీవీ, యూట్యూబ్, ఎంఎక్స్ ప్లేయర్ తదితర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఉచితంగా, లేదా ప్రకటన మద్దతు ఉన్న కంటెంట్‌ను కూడా చూసే వీలుంది. హోమ్ స్క్రీన్‌లోని డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ నుంచి కలర్స్, జీ, సోనీ, స్టార్, డిస్కవరీ, న్యూస్18, డీడీ నేషనల్ వంటి లైవ్ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే దానిలోని 1.7 జీహెచ్ జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ద్వారా కంటెంట్‌ను అందిస్తుంది. విభిన్న ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీలలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వైఫై 6 అనుకూల రూటర్, 5జీహెచ్ జెడ్, 2.4జీహెచ్ జెడ్ వైఫై బ్యాండ్‌లకు మద్దతునిస్తుంది.

వాయిస్ ఇన్ పుట్

వాయిస్ ఇన్ పుట్ రిమోట్ దీనిలోని మరో ప్రత్యేకత. కంటెంట్‌ను కనుగొనడానికి, ప్రారంభించేందుకు, నియంత్రించడానికి అలెక్సా వాయిస్ రిమోట్‌తో వస్తుంది. కస్టమర్లు ముందుగా సెట్ చేసిన బటన్‌లతో తమకు ఇష్టమైన యాప్‌లను సెట్ చేసుకోవచ్చు. రిమోట్‌తో కేవలం టీవీ పవర్, వాల్యూమ్‌ను నియంత్రించవచ్చు. వినియోగదారులు స్టాండ్‌బై, స్లీప్ మోడ్‌కి వెళ్లినప్పుడు శక్తిని ఆదా చేయడంలో సహాయపడే తక్కువ పవర్ మోడ్ కూడా ఇందులో ఉంది.

ఉపయోగించే విధానం

ముందుగా టీవీలోని హెచ్ డీఎమ్ఐ పోర్ట్ కి ఫైర్ టీవీ స్టిక్ 4కెను ప్లగ్ చేయాలి. పవర్ అడాప్టర్‌ వాల్ అవుట్‌లెట్‌కి కనెక్ట్ చేయాలి. రిమోట్‌లో బ్యాటరీలు వేసి, ఆన్ స్క్రీన్ సూచనలను పాటించాలి. ఫైర్ టీవీ స్టిక్ ను వైఫైకి కనెక్ట్ చేయడం, అమెజాన్ ఖాతాకు సైన్ ఇన్ చేసిన తర్వాత నచ్చిన భాషను ఎంచుకోవాలి. ఇది ప్రక్రియ పూర్తయిన తర్వాత అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కెను ఉపయోగించుకోవచ్చు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి