How to Check Aadhaar Card Usage History Online to Find Out Misuges of This Important Document Details

How to Check Aadhaar Card Usage History Online to Find Out Misuges of This Important Document Details

మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ ఉపయోగించబడిందో ఇలా చెక్ చేసుకోవచ్చు

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొబైల్ సిమ్ కార్డు తీసుకునే వరకు ఇప్పుడు అన్నింటికీ ఆధార్ కార్డు(Aadhar card)చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా ఆధార్ లేకుంటే లభించడం లేదు. అయితే ఆధార్‌కు ప్రాధాన్యత పెరగడంతో ఆధార్ కార్డు ద్వారా మోసాల కేసులు కూడా పెరిగాయి. కాబట్టి, ఇప్పుడు మీరు మీ ఆధార్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అయితే మీ ఆధార్ హిస్టరీని మీరు  సులభంగా తెలుసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

ఆధార్‌ను తయారు చేసే సంస్థ..UIDAI ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ హిస్టరీని చెక్ చేసే  సౌకర్యాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ ఎక్కడ ఉపయోగించబడుతుందో ఆధార్ హిస్టరీ మనకు తెలియజేస్తుంది? ఇది మొదట ఎక్కడ ఉపయోగించబడింది?  మీ ఆధార్ కార్డ్ ఏయే డాక్యుమెంట్లతో లింక్ చేయబడిందో కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్ గత ఆరు నెలల ప్రామాణీకరణ రికార్డును చెక్ చేయవచ్చు. ఒకేసారి గరిష్టంగా 50 రికార్డులను తనిఖీ చేయవచ్చు. దీనితో, తమ ఆధార్‌ను ఉపయోగించడానికి UIDAI నుండి ఎవరు ప్రామాణీకరణ కోరారో తెలుస్తుంది.

ఇలా తనిఖీ చేయండి

ముందుగా ఆధార్ కార్డ్ uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

ఇక్కడ My Aadhar ఆప్షన్ ను ఎంచుకోండి.

Aadhaar Services ఆప్షన్ క్రింద, Aadhaar Authentication History కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. సెక్యూరిటీ కోడ్‌ని ఎంటర్ చేసి సెండ్ OTPపై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు ఆధార్ కార్డు హిస్టరీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తప్పు సమాచారాన్ని తీసివేయవచ్చు

మీ ఆధార్ దుర్వినియోగం అవుతున్నట్లు మీరు భావిస్తే, మీరు వెంటనే UIDAI టోల్ ఫ్రీ నంబర్ – 1947ను సంప్రదించవచ్చు లేదా help@uidai.gov.inకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా, మీ ఆధార్‌లో ఏదైనా తప్పుడు సమాచారం నమోదు చేయబడితే, మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లి దాన్ని సరిదిద్దవచ్చు.

మాస్క్ ఆధార్‌ను ఉపయోగించండి

మీరు ఎక్కడైనా ఆధార్ ఫోటోకాపీని ఇవ్వవలసి వస్తే, అప్పుడు మాస్క్ ఆధార్‌ను ఉపయోగించండి. మాస్క్డ్ ఆధార్ కార్డ్ కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడుతుంది. ఇది సాధారణ ఆధార్ కార్డుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్ కార్డ్‌లో 12 నంబర్ల ఆధార్ నంబర్‌లు ముద్రించబడి ఉంటాయి, అయితే ఈ కార్డులో చివరి 4 నంబర్‌లు మాత్రమే ముద్రించబడతాయి. ఆధార్ కార్డ్‌లోని మొదటి 8 ఆధార్ నంబర్‌లు మాస్క్‌డ్ ఆధార్ కార్డ్ IDలో ‘XXXX-XXXX’ అని వ్రాయబడి ఉంటాయి. ఈ విధంగా ఆధార్ కార్డ్ హోల్డర్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అపరిచితులకు కనిపించదు, ఇది ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధిస్తుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి