Ap cabinet green signal to another new scheme in andhra pradesh detils

Ap cabinet green signal to another new scheme in andhra pradesh detils

ఏపీలో ఇవాళ జగన్ అధ్యక్షతన క్యాబినేట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.ఏపీలో ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నారు. ఇకపై వీటితో పాటుగా..  జగనన్న సివిల్స్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరిట కొత్త పథకాన్ని తీసుకురానున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులైన వారికి రూ.50వేలు, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించారు.

దీనిలో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీపీఎస్‌ ముసాయిదా, ఏపీ వైద్య విధాన పరిషత్‌ సవరణ బిల్లులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. జగనన్న ఆరోగ్య సురక్ష, కురుపాం ఇంజినీరింగ్‌ కళాశాలలో గిరిజనులకు 50 శాతం సీట్లిచ్చే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది.

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యే నాటికి సొంత ఇంటి స్ధలం ఉండేలా చూడాలని నిర్ణయించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని కేబినెట్ నిర్ణయించింది.

వచ్చే నెల దసరా పండగ రానుంది, దీంతో దసరా నుండి విశాఖ నుండి పాలన.. చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా cmo తరలించి.. ఆ తర్వాత ఎన్నికల పై కేంద్ర నిర్ణయాన్ని అనుసరించాలని సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసకుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి