Do This If Your Hands Are Burning After Chopping Green Chilies

Do This If Your Hands Are Burning After Chopping Green Chilies

పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!

నిత్యం ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. పచ్చి మిర్చి కట్ చేశాక చేతులు మండుతూ ఉంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువగా మండుతాయి. ఇలా చేతులు మండటానికి కారణం.. మిర్చీలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. అయితే ఈ మంటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ చేశాయి. పచ్చి మిర్చి కోశాక చాలా మందికి చేతులు మండుతూ ఉంటాయి. అందుకే పచ్చి మిర్చి కట్ చేశాక.. వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంట అనేది రాదు. పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతూ ఉంటే..

నిత్యం ఉపయోగించే వాటిల్లో పచ్చి మిర్చి కూడా ఒకటి. పచ్చి మిర్చి కట్ చేశాక చేతులు మండుతూ ఉంటాయి. ఒక్కోసారి బాగా ఎక్కువగా మండుతాయి. ఇలా చేతులు మండటానికి కారణం.. మిర్చీలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం. అయితే ఈ మంటను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు మీకు చక్కగా హెల్ప్ చేశాయి.

పచ్చి మిర్చి కోశాక చాలా మందికి చేతులు మండుతూ ఉంటాయి. అందుకే పచ్చి మిర్చి కట్ చేశాక.. వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇలా చేయడం వల్ల మంట అనేది రాదు. పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతూ ఉంటే.. ఐస్ క్యూబ్స్ రాయండి. ఇలా చేస్తే వెంటనే ఉపశమనం ఉంటుంది.

అలాగే ముందు ఉల్లిపాయలు కాకుండా.. పచ్చి మిర్చి కట్ చేసి ఆ తర్వాత ఉల్లి పాయలు కట్ చేస్తే.. ఇలా చేడయం వల్ల కూడా మంట తగ్గుతుంది. అదే విధంగా పచ్చి మిర్చి కట్ చేశాక.. ఇతర కూరగాయలు కట్ చేయడం వల్ల కూడా మంట అనేది ఉండదు.

ఈ చిట్కా కూడా మంట తగ్గడానికి చక్కగా పని చేస్తుంది. పచ్చి మిర్చి కట్ చేశాక.. చేతులు మండితే.. కలబంద జెల్ రాసుకోండి. ఓ రెండు నిమిషాలు ఉంచుకుని హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలు. మంట అనేది తగ్గుతుంది.

చేతులు బాగా మండుతూ ఉంటే.. నిమ్మ రసాన్ని చేతులపై రాసి వాష్ చేసుకోండి. మంట తగ్గి పోతుంది. ఎందుకంటే నిమ్మలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మంటలను వెంటనే తగ్గించి.. ఎర్ర బడకుండా చేస్తాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి