Government To Distribute Ragi Flour From March To Ration Card Holders

Government To Distribute Ragi Flour From March To Ration Card Holders

రేషన్ కార్డు ఉన్న వారికి అదిరే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం తీపికబురు అందించింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఎలాంటి బెనిఫిట్ అందిస్తోందో తెలుసుకుందాం.

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకువచ్చింది. ఈ నెల నుంచి రేషన్ సరుకుల్లో అదనంగా ఇంకొకదాన్ని అందించబోతుంది. రేషన్‌ షాపులు ద్వారా జొన్నలు, రాగులతో పాటు మరో వస్తువును చేర్చింది.కేవలం రూ.11కు కేజీ రాగి పిండి అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా ఇప్పటికే

జొన్నలు, రాగులు, రాగి పిండి ప్యాకెట్లను పౌర సరఫరాల శాఖ రేషన్‌ డీలర్లకు చేరవేసిందని తెలుస్తోంది. అందువల్ల వీటిని రేషన్ కార్డు కలిగిన వారు పొందొచ్చు.

మార్చి నెల 1 తేదీ నుంచి 16వ తేదీ వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఆయా పదార్థాలను రేషన్ కార్డు కలిగిన వారు పొందొచ్చు. ఏపీ సర్కార్ పేదలు, మధ్య తరగతి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే పౌర సరఫరా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డు కలిగిన వారు బియ్యం, కంది పప్పు, చక్కెర వంటివి పొందుతున్నారు. ఇంకా రాగులు కూడా ప్రజలకు లభిస్తున్నాయి.

రేషన్ కార్డు కలిగిన వారు 3 కేజీల వరకు రాగులు తీసుకుంటే వారి కోటాలో వచ్చే బియ్యంలో మూడు కేజీలు తగ్గిస్తారు. ఇక ప్రజలకు జొన్నలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి నేరుగా జొన్నలు సేకరించింది. అందుకే ఈ నెల నుంచి ప్రతి రేషన్‌కార్డుకు కేజీ నుంచి మూడు కేజీల వరకు జొన్నలను పొందొచ్చు. బియ్యానికి బదులు జొన్నలు తీసుకోవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం మార్కెట్‌లో రాగి పిండి ధర కేజీకి రూ.40 వరకు ఉంది. అయితే రేషన్ కార్డు కలిగిన వారు కేజీ రాగి పిండిని కేవలం రూ.11కే పొందొచ్చు. రాగి పిండి తీసుకుంటే బియ్యం వాటాలో కేజీని తగ్గిస్తారని గుర్తు పెట్టుకోవాలి.కాగా రాగి పిండిలో వివిధ పోషకాలు ఉంటాయి. ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌, బీ 12 విటమిన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కాగా రాగి పొండిని ముందుగా పల్లె ప్రాంతాలలో, తర్వాత పట్టణ ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఉత్తరాంధ్ర, రాయల సీమలోని పలు జిల్లాలలో రాగి పిండి ముందుగా అందుబాటులోకి రావొచ్చు. అటుపైన పూర్తి స్థాయిలో ఈ ప్రయోజనాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు రానుంది.

ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మ‌న్యం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాలలో రాగి పిండి అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి