IISER Tirupati Aptitude Test 2024

IISER Tirupati Aptitude Test 2024

IISER Tirupati 2024: ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష తేదీ ఇదే.. నేటితో ముగుస్తోన్న దరఖాస్తుల సవరణ గడువు

 ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశ వ్యాప్తంగా ఉన్న 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) కేంద్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల బీఎస్-ఎంస్ ఇంటిగ్రేటెడ్ కోర్సు, నాలుగేళ్ల బీఎస్ ఇంజినీరింగ్ సైన్సెస్, ఎకానమిక్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసర్ ఆప్టిట్యూడ్టెస్ట్ (ఐఏటీ) జూన్ 9న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మే 13తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1న వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి