HMD Launching First Smartphone In India

HMD Launching First Smartphone In India

HMD Arrow: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన HMD తొలి స్మార్ట్ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ గురించి ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కంపెనీ నోకియా ఫోన్‌లను రూపొందిస్తూ వస్తోంది. అయితే తొలిసారి హెచ్‌ఎమ్‌డీ తన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈ కంపెనీ నుంచి ఇప్పటికే హెచ్‌ఎమ్‌డీ ప్లస్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ కాగా.. దీనికి కొనసాగింపుగా ఈ ఫోన్‌ ఉండనుందని సమాచారం. ఇక ఈ స్మార్ట ఫోన్‌ను ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 12,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారని సమాచారం.

ఇక ఇది వరకు లాంచ్‌ చేసిన హెచ్‌ఎమ్డీ ప్లస్ ఫోన్‌లో 6.65 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ప్రస్తుతం వచ్చే హెచ్‌ఎమ్‌డీ ఆరోలో కూడా ఇంచుమించు ఇవే ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం .

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి