Redmi Offering Price Cut On Redmi Note 12 Smart Phone Check

Redmi Offering Price Cut On Redmi Note 12 Smart Phone Check

Redmi Note 12: రెడ్‌మీ నోట్‌12పై భారీ డిస్కౌంట్‌.. రూ. 9 వేలకే..

తాజాగా అందించిన డిస్కౌంట్‌తో రెడ్మీ నోట్ 12 4జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కి తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999కి చేరింది. అయితే ఈ డిస్కౌంట్‌ ఇక్కడితే ఆగిపోలేదు ఫ్లిప్‌కార్ట్‌లో డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. గరిష్టంగా...

స్మార్ట్ ఫోన్‌ కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఫోన్ల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. లాంచింగ్ సమయంతో పోల్చితే ధరలను తగ్గిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ సైతం స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ నోట్‌12 సిరీస్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

గత ఏడాది మార్చిలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ ధరను కంపెనీ ఇప్పటికే రెండు సార్లు తగ్గించింది. దీంతో ఈ ఫోన్‌ బడ్జెట్ రేంజ్‌లో లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 10,499కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. లాంచింగ్ సమయంలో రెడ్మీ నోట్ 12 4జీ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 గాను, 6 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గాను ఉండేది. అనంతరం.. జనవరిలో ఈ రెండు ఫోన్ల ధరలను రూ.2,000 తగ్గించారు.

తాజాగా అందించిన డిస్కౌంట్‌తో రెడ్మీ నోట్ 12 4జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999కి తగ్గింది. ఇక 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999కి చేరింది. అయితే ఈ డిస్కౌంట్‌ ఇక్కడితే ఆగిపోలేదు ఫ్లిప్‌కార్ట్‌లో డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. గరిష్టంగా రూ. 1500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ను రూ. 9,597కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఇక రెడ్‌మీఓ నోట్‌ 12 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1080×2400 పిక్సెల్స్ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరి విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

అలాగే కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ప్రో మోడ్, డాక్యుమెంట్ మోడ్, షార్ట్ వీడియో, పనోరమ, కస్టమ్ వాటర్మార్క్ వంటి ఎన్నో ఫీచర్లను అందింఆచరు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తున్న వేళ రెడ్‌మీ ఈ 4జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి