TELUGU ACTRESS PREETHI ASRANI DOING MORE FILMS IN TAMIL KTR

TELUGU ACTRESS PREETHI ASRANI DOING MORE FILMS IN TAMIL KTR
TELUGU ACTRESS PREETHI ASRANI DOING MORE FILMS IN TAMIL KTR
TELUGU ACTRESS PREETHI ASRANI DOING MORE FILMS IN TAMIL KTR

Preethi Asrani: త‌మిళ సినిమాల‌తో.. దూసుకుపోతున్న తెలుగు ముద్దుగుమ్మ‌

శశికుమార్‌ హీరోగా నూతన దర్శకుడు మందిర మూర్తి దర్శకత్వంలో 2023లో వచ్చిన చిత్రం ‘అయోతి’(Ayothi), యశ్‌పాల్‌ శర్మ, ప్రీతి అస్రానీ (PreethiAsrani) హీరోయిన్లుగా నటించగా, పుగళ్‌, బోస్‌ వెంకట్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

 

ఇందులో ప్రీతి అస్రానీ అమాయకమైన యువతిగా నటించి ప్రేక్షకుల మనసుల్లో స్థిరపడిపోయారు. పైగా ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో ఆమెకు ఆఫ‌ర్లు తలుపు త‌డుతున్నాయి. తెలుగులో అవ‌కాశాలు అశించినంత‌గా లేకున్నా త‌మిళంలో మాత్రం వ‌రుస‌గా ఛాన్సులు ద‌క్కించుకుంటోంది.

తాజాగా త‌మిళ సెన్షేష‌న్ కవిన్ (Kavin) హీరోగా నటిస్తున్న‌ ఐదో చిత్రంలో ప్రీతి అస్రానీ (PreethiAsrani) హీరోయిన్‌గా చేస్తోండ‌గా షూటింగ్ ఫైన‌ల్ స్టేజీలో ఉంది. ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సతీష్‌ దర్శకత్వం వహించనున్నారు.

‘అయోతి’ చిత్రంలో తాను పోషించిన పాత్ర కంటే ఇది పూర్తిభిన్నంగా ఉంటుందని ప్రీతి వెల్లడించింది. అలాగే ఇటీవ‌ల ఫైట్ క్ల‌బ్ చిత్రంలో అల‌రించిన‌ విజ‌య్ కుమార్ హీరోగా వస్తున్న ఎల‌క్ష‌న్ అనే చిత్రంలో, రియోరాజ్‌ హీరోగా నటించే మరో చిత్రంలోనూ ప్రీతి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సో అల్ ది బెస్ట్ టూ ప్రీతి అస్రానీ

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి