electric bike hop oxo price range battery charging other details

electric bike hop oxo price range battery charging other details

Hop Oxo Bike:మీరు హోప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ లేదా కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వీటిని కొనొచ్చు. సరికొత్త ఈ-బైక్‌లో ఎకో, పవర్, స్పోర్ట్ అనే 3 రైడ్ మోడ్స్‌ ఉంటాయి. కొన్ని వేరియంట్లలో మాత్రం టర్బో మోడ్ అదనంగా ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్‌ గంటకు 95 కిలోమీటర్లు. కేవలం 4 సెకన్లలో 0-40 కిలోమీరట్ల వేగానికి అందుకుంటుంది. ఈ బైక్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో 3.75 kWh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.

బైక్‌కు IP67 రేటింగ్‌ ఉంది. అంటే డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ దీని సొంతం. బైక్‌ను పోర్టబుల్ స్మార్ట్ ఛార్జర్‌తో ఏదైనా 16 Amp పవర్ సాకెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఛార్జర్‌తో కేవలం 4 గంటలలోపు 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్‌లో మల్టీ-మోడ్ రీ-జెనరేటివ్ బ్రేకింగ్, 4G కనెక్టివిటీ, స్పీడ్ కంట్రోల్, జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని స్మార్ట్ ఫీచర్లను ఆక్సో అనే ఒక మొబైల్ అప్లికేషన్‌తో కంట్రోల్ చేయవచ్చు.

బైక్ ధరల విషయానికి వస్తే.. వేరియంట్ ఆధారంగా రేటు మారుతుంది. ఆక్సో ప్రైమ్ వేరియంట్ ధర రూ. 1.43 లక్షలుగా ఉంది. ఆక్సో ప్రైమ్ ప్రో వేరియంట్ ధర రూ. 1.5 లక్షలుగా ఉంది. ఇంకా ఆక్సో వేరయింట్ ధర రూ. 1.55 లక్షలుగా కొనసాగుతోంది. ఆక్సో ప్రో వేరియంట్ ధర రూ. 1.56 లక్షలుగా ఉంది. ఆక్సో ఎక్స్ వేరియంట్ ధర రూ. 1.73 లక్షలుగా ఉంటుంది. మీరు ఈ బైక్‌ను రూ. 999 మొత్తంతో ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువే. కంపెనీ ప్రకారం చూస్తే.. కిలోమీటరుకు 25 పైసలు ఖర్చు వస్తుంది. అంటే ఒక రూపాయి ఖర్చుతో 4 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అంటే రూ.100తో 400 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి