janhvi-kapoor-open-comments-on-her-marriage-details

janhvi-kapoor-open-comments-on-her-marriage-details

పెళ్లిపై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్.. కలల రాకుమారుడు వాడేనంటూ..!

సెలబ్రిటీల తాలూకు పెళ్లి విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే మీడియా నుంచి కూడా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా తారసపడుతుంటాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు తన పెళ్లి, కలల రాకుమారుడిపై ఓపెన్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టింది.

నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడూ అండగా ఉండే వాడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు కావాలని, బాధల్లో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్.

మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌.

తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది.

ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి