Guess The Beauty In This Viral Photo

 Guess The Beauty In This Viral Photo

వామ్మో.! ఏం మేకోవర్.. ఈ వయ్యారిని గుర్తుపట్టారా.? అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది..

ఈ ఫోటోలోని అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? నడుమందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. చిన్న వయస్సులోనే నటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఈ మలయాళ బ్యూటీ.. మాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి.. తన నటనతో మెప్పించింది. ఇక ఇటీవల మలయాళంలో విడుదలైన ‘ప్రేమలు’ మూవీతో.. అటు మాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో కుర్రాళ్లలో పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో మీకు గుర్తొచ్చి ఉండొచ్చు.! అదేనండీ మరెవరో కాదు.. మమితా బైజు.

కేరళలోని కొట్టాయంలో పుట్టిన ఈ చిన్నది.. 2017లో ‘సర్వోపరి పాలక్కరన్’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘హనీ బీ’, ‘డాకినీ’, ‘కృష్షం’, ‘స్కూల్ డైరీ’, ‘ది ఇంటర్నేషనల్ లోక్ స్టోరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’, ‘సూపర్ శరణ్య’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ‘ప్రేమలు’ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. కాగా, ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి