Srisailam Devotees Dornala Forest Gates Will Open In Night Time To Clear Shivaratri Rush

Srisailam Devotees Dornala Forest Gates Will Open In Night Time To Clear Shivaratri Rush

శివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... అధికారుల కీలక నిర్ణయం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తుల తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. అయితే శ్రీశైలం రావాలంటే తగిన సమయ వేళల్లోనే రావాలి. రాత్రి 9 అయితే రాలేరు. దోర్నాల వద్ద ఫారెస్ట్ ఆఫీసర్స్ రాత్రి 9 అయితే చాలు అక్కడ గేట్లు క్లోజ్ చేస్తారు. రాత్రి సమయాలలో శ్రీశైలానికి ఎలాంటి వెహికల్స్ పంపరు ఫారెస్ట్ అధికారులు.

ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే ఒక పద్ధతి ప్రకారం ఈ గేట్లు ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకు మూసేసిన గేట్లను ఉదయం 6 గంటల తర్వాత ఓపెన్ చేయడం జరుగుతూ వస్తుంది. అదే విధంగా ప్రస్తుతం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్షలాదిమంది భక్తాదులువేలాది సంఖ్యలో వాహనాలను తీసుకొని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం వస్తున్నటువంటి సందర్భం.

శివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దోర్నాలలో ఫారెస్ట్ గేట్లను క్లోజ్ చేయకుండా నిర్ణయించారు ఆలయాధికారులు.శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా వారికి అనుమతి ఇవ్వాలని శ్రీశైల దేవస్థానం అధికారులు ఫారెస్ట్ అధికారులను కోరారు. దీంతోమార్చి 11వ తేదీ దాకా పూర్తి అనుమతులు ఇవ్వడం జరిగింది. అందువలన శ్రీశైలం శ్రీశైలం వచ్చే ప్రయాణికులు ఇది గమనించవలసిందిగా తెలియజేశారు.

ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి రావచ్చు.వాహనాలకు అన్నిటికి పూర్తిగా పర్మిషన్స్ జారీ చేయడం జరిగిందన్నారు. అయితే రాత్రి సమయాలలో ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు వాహనాలను అధిక స్వీడులో పోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అందులోనూ ఫారెస్ట్ లోకి వాహనాలు ఎంట్రీ అయిన తర్వాత జంతువులు ఎదురైనా వాటిని ఇబ్బంది పెట్టకుండా వాహనదారులు ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలతో ప్రయాణం చేయాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి