Free Education Provided Along With Rs 15 Thousand To The Students

Free Education Provided Along With Rs 15 Thousand To The Students

School Students: విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీ విద్యతో పాటు రూ.15 వేలు..

పేదలకు ఫీజుల భారం లేకుండా ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి ఇదొక శుభవార్తనే చెప్పాలి.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విద్యా, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తుండగా.. పేద విద్యార్థులకు సైతం ఉచిత విద్యను అందించేందుకు గత రెండేళ్లుగా కీలక చర్యలు చేపట్టింది జగన్ ప్రభుత్వం.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు.

ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. అర్భన్ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్స్ కు రూ.5 వేలు, రూరల్ పరిధిలో రూ.6,500 ఫీజును ప్రభుత్వం చెల్లించనుంది.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు అమ్మఒడి డబ్బుల్లోనే ఫీజు చెల్లించి మిగిలిన మొత్తాన్ని విద్యార్థి తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

ప్రైవేట్‌ విద్యాసంస్థలో విద్యనభ్యసించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఎంపిక విధానం అనేది లాటరీ ద్వారా చేయనున్నారు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది.  

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి