HDFC bank plans to launch new mobile app details

HDFC bank plans to launch new mobile app details

HDFC Bank News బ్యాంక్ కొత్త సర్వీసులు తీసుకువచ్చే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (Bank) కస్టమర్ల కోసం సరికొత్త యాప్‌ను (App) తీసుకువచ్చే పనిలో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ యాప్‌ను సరికొత్తగా మార్చాలని బ్యాంక్ యోచిస్తోంది. అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను కూడా సరికొత్తగా ఆవిష్కరించనుందని తెలుస్తోంది. మార్చి కల్లా ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రావొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిసెంబర్ కల్లా ఎంపిక చేసిన యూజర్లకు డిసెంబర్ కల్లా ఈ సేవలను పైలెట్ ప్రాజెక్ట్ కింద అందుబాటులోకి తీసుకురానుంది. అటుపైన మార్చి కల్లా అందరికీ ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసన్ అంజనీ రాథోర్ ఈ విషయాలను వెల్లడించారని మింట్‌ పేర్కొంటోంది. అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు కొత్త యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కొత్త కొత్త సదుపాయాలు కూడా అందుబాటులోకి రావొచ్చని చెప్పుకోవచ్చు.

కాగా మరో వైపు ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ట్రూక్యాప్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మధ్య ఇటీవలనే కీలక ఒప్పందం జరిగింది. ఇరు ఆర్థిక సంస్థలు తాజాగా కోలెండింగ్ అంశంపై భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీని ద్వారా కస్టమర్లకు మరింత సులభంగా రుణాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా నాన్ అర్బన్ లొకేషన్స్‌లో ఉన్న వారికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ట్రూక్యాప్ ఫైనాన్స్ సంస్థలు సూక్ష్మ స్థూల మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈలకు) బిజినెస్ లోన్స్ మరింత సులభంగా అందించనున్నాయి. అలాగే గోల్డ్ లోన్స్ కూడా ఈజీగా అందుబాటులోకి రానున్నాయి.

ఎంఎస్ఎంఈ లెండింగ్‌లో ప్రత్యేకతను చాటుకుంటున్న ట్రూక్యాప్ ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యం ద్వారా మరింత మందికి ఈ రుణాలు అందించనుంది. ట్రూక్యాప్ అనేది ఇప్పటికే రూ.2 వేల కోట్ల విలువైన రుణాలు జారీ చేసింది. 1,90,000 కస్టమర్లకు కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 50 పట్టణాల్లో 118 బ్రాంచులు కలిగి ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి ఎక్కువగా రుణాలు అందిస్తోంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి