mahila samman savings certificate much amount with 2lakhs investment

mahila samman savings certificate much amount with 2lakhs investment

Women Scheme: మహిళల కోసం అదిరిపోయే ప్రభుత్వ పథకం.. అకౌంట్లోకి 32,000 రూపాయలు

Women Scheme: చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేందుకు మహిళలకు ఓ మంచి పథకం అమల్లో ఉంది. ఇందులో పెట్టుబడి పెడితే ఎలాంటి నష్టం ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. మరి ఆ పథకమేంటి? అందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎంత రిటర్న్స్ వస్తాయో తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ .. ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇందులో మహిళలు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తంపై 7.50 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. పథకం మెచ్యూరిటీ వ్యవధి 2 సంవత్సరాలు. ఒకవేళ 2024 మార్చిలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే.. 2025 మార్చిలో మెచ్యూరిటీకి వస్తుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు సంబంధించి మహిళ స్వయంగా తన పేరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. తన పిల్లలు లేదా ఇతర చిన్న పిల్లల సంరక్షకురాలిగానూ ఖాతాను తెరవచ్చు. ఇందులో చేరాలనుకునే మహిళలు 2025 మార్చి 31 లోపల ఫామ్-Iను నింపాల్సి ఉంటుంది.

ఇది నెలనెలా కట్టే పథకం కాదు. ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం రూ.1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. ఆ తర్వాత 100 మల్టిపుల్స్‌తో అంటే.. రూ.1000, 1100, రూ.1200.. ఇలా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఎంత డిపాజిట్ చేసినా ఒకేసారి చేయాల్సి ఉంటుంది.

గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అంతకు మించి ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు వీలులేదు. ఎప్పుడు డిపాజిట్ చేసినా.. రెండేళ్ల తర్వాత వడ్డీతో కలిపి మీకు డబ్బులొస్తాయి. మహిళా సమ్మాన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 7.5 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది.

ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి.. ఆ మొత్తాన్ని మీ ఖాతాల్లో జమచేస్తారు. రెండేళ్ల తర్వాత ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. అప్పుడు ఫామ్-2ను నింపి.. డబ్బులు తీసుకోవచ్చు. మీరు డిపాజిట్ చేసిన ఏడాది గడచిన తర్వాత డబ్బులు కావాలనుకుంటే 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం ఫామ్-3 దరఖాస్తు చేయాలి

రెండేళ్లు పూర్తికాక ముందు పూర్తి డబ్బులు తీసుకునే అవకాశం లేదు. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఉంటుంది. ఖాతాదారుడు చనిపోయినా లేదంటే ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా.. అలాంటి సందర్భాల్లో డబ్బులను ముందుగా తీసుకోవచ్చు.

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే డబ్బుకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకుల్లో ఈ ఖాతాలను తెరవచ్చు.

మహిళలు రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. రెండేళ్లకు గాను 32,044 రూపాయలు వడ్డీ లభిస్తుంది. వడ్డీ, అసలు కలిపి మీకు రూ.2,32,044 రూపాయలు మీ చేతికొస్తాయి. ఈ లెక్కన మీరు 2 లక్షలు పెట్టుబడి పెడితే.. రెండేళ్ల పాటు నెలకు రూ.1350 అదనపు ఆదాయం వస్తుందన్నమాట.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి