Inter Exam Centers Are All Ready Details

Inter Exam Centers  Are All Ready Details

ఇంటర్ పరీక్షలకు విశాఖ జిల్లాలో 168 కాలేజీలకు ప్రభుత్వం గుర్తింపు చేసింది. పరీక్షలకు హాజరుకానున్న 77,175 వేల మంది విద్యార్థులు సౌకర్యాలున్న కాలేజీలనే కేంద్రాలుగా ఎంపిక చేశారు. క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేస్తున్న అధికారులు హాస్టళ్లు నిర్వహించే కాలేజీలకు నో ఛాన్స్ చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా కేటాయించిన పరీక్ష జరిగే గదుల్లో ఒక్కో బెంచిపై ఇద్దరు విద్యార్థులకు మాత్రమే సీటింగ్ కేటాయించేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఐదు అడుగులలోపు ఉన్నట్లయితే ఒక్క విద్యార్థికే సీటింగ్ కేటాయిస్తున్నారు. మార్చి 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు జిల్లాలో 1,751 మంది అధ్యాపకుల వివరాలను ఆన్ లైన్ లో ఇప్పటికే నమోదు చేశారు. కళాశాలకు నో చాన్స్ పరీక్ష కేంద్రాల ఎంపికలో ఇంటర్ బోర్డు అధికారులు ఈసారి కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

విశాఖలో కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో రెసిడెన్షియల్ పేరిట హాస్టళ్లు సైతం నిర్వహిస్తున్నారు. ఇలాంటి కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో, జిల్లా అధికారులు సమగ్ర పరిశీలన చేస్తున్నారు.

2022-23 విద్యాసంవత్సరం వరకు ఉన్న జాబితాలో జిల్లాలో 78 కాలేజీల్లో కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈసారి వీటిలో 23 కాలేజీలను పక్కన పెట్టారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీటి విషయంలో తుది నిర్ణయం తీసుకో వాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.

ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసేందుకు అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. గుర్తించిన కాలేజీల్లో అందుబాటులో ఉన్న రూములు. అక్కడ ఉన్న వసతులను పరిగణలోకి తీసుకొని 90 కేంద్రాలను ఎంపిక చేసేలా ముమ్మర కసరత్తు చేశారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బోర్డు ఉన్నతాధికారుల నుంచి సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్న కాలేజీలనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికే 60 కాలేజీ లను గుర్తించి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. మరో 35 కేంద్రాల పరిశీలన జరుగుతోందని, ఉమ్మడి విశాఖ ఆర్ఎవో , రాయల సత్యనారాయణ తెలిపారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి