The Best Air Coolers From Orient Electric

The Best Air Coolers From Orient Electric

కూలర్ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ ధర.. అత్యుత్తమ ఫీచర్లతో బెస్ట్ కూలర్లు ఇవే..

వేసవి ఎండలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో చల్లదనాన్ని ఇచ్చే ఏసీలు, కూలర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఏసీలు సాధారణంగా సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇక కూలర్ల పైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడతారు. నేడు ప్రతి ఇంటిలో కూలర్‌ తప్పనిసరిగా కనిపిస్తోంది. అనేక రకాల ఫీచర్లతో వివిధ కంపెనీల కూలర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో కొనుగోలుదారులకు సరైన అవగాహన ఉండదు. మెరుగైన ఫీచర్లు, నాణ్యత కలిగి ఇంటి వాతావరణానికి సరిపడే కూలర్ ఎంచుకోవడం చాలా అవసరం.

అధిక సామర్థ్యం..

ప్రముఖ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ అధిక సామర్థ్యం కలిగిన ఎయిర్ కూలర్లను దేశంలో విడుదల చేసింది. ఏరో ఫ్యాన్ టెక్నాలజీ, ఆటో ఫిల్ ఫంక్షన్, IoT కంపాటిబులిటీ తదితర ఆధునిక ఫీచర్లతో నూతన శ్రేణి ఎయిర్ కూలర్లను పరిచయం చేసింది. వాటిలో స్మార్ట్‌ చిల్‌ 125 ఎల్‌, అవంటే 105 ఎల్‌, టైటాన్‌ 100 ఎల్‌, మాక్సోచిల్‌ 100 ఎల్‌ తదితర మోడళ్లు ఉన్నాయి. పెద్ద ట్యాంక్‌ సామర్థ్యం, ఆధునాతన ఫీచర్లు ఈ కూలర్ట ప్రత్యేకత. వీటిలో స్మార్ట్‌చిల్, అవంటే,టైటాన్ కూలర్లు డెజర్ట్ విభాగంలో, మాక్సోచిల్ వాణిజ్య కూలర్ కేటగిరీలో ఉన్నాయి.

అత్యుత్తమ ఫీచర్లు..

ఈ కూలర్లలో ఏరో ఫ్యాన్ టెక్నాలజీతో కూడిన ఫ్యాన్ బ్లేడ్లు ఉన్నాయి.ఇది 60 అడుగుల వరకు చల్లని గాలిని ప్రసరింపజేస్తాయి. అలాగే వీటిలో 25 శాతం ఎక్కువ శీతలీకరణ, ఆటో ఫిల్ ఫంక్షన్, దోమల నివారణ, ఐస్ ఛాంబర్, ఎక్కువ కాలం నీటిని నిలుపుకునేలా డెన్స్‌నెస్ట్ టెక్నాలజీతో కూడిన హనీకోంబ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మామూలు కూలర్లతో పోల్చితే వీటిలోని ప్రత్యేకతల కారణంగా మెరుగైన చల్లటి గాలిని అందిస్తాయి. గదిలో నలుమూలలకూ గాలి చక్కగా వెళుతుంది.

అవసరాలకు అనుగుణంగా..

ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ఈసీడీ బిజినెస్ హెడ్ గౌరవ్ ధావన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్ల వాడకం బాగా పెరుగుతుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కూలర్లలో ఓరియంట్ ఎలక్ట్రిక్ కూలర్ల ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజల అవసరాలకు తగిన విధంగా అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ మెటీరియల్ కారణంగా మెరుగైన సామర్థ్యంతో పనిచేసేలా రూపొందించారు. ఐవోటీ, వాయిస్ నియంత్రిత ఎయిర్ కూలర్లు, ర్‌లు, మెటల్ బాడీడ్ కూలర్లు, ఎనర్జీ సేవింగ్ ఇన్వర్టర్ ఎయిర్ కూలర్లు తదితర 60 కంటే ఎక్కువ మోడల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి