New Plans Launched By Airtel with 2 gb data get details

New Plans Launched By Airtel with 2 gb data get details

ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్‌ డేటా వాడకం విపరీతంగా పెరిగిందిఈ నేపథ్యంలో డేటా ప్లాన్స్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. గతంలో 1 జీబీ డేటానే నెలంతా చాలా పొదుపు వాడుకునే వాళ్లు ప్రస్తుతం రోజుకు 1 జీబీ డేటా కూడా చాలడం లేదనే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు కూడా అధిక డేటాను అందించే వివిధ ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కూడా రోజు 2 జీబీ డేటాను అందించే వివిధ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రోజు 2 జీబీ డేటా వచ్చే ప్లాన్స్‌పై ఓ లుక్కేద్దాం.

రూ.299 ప్లాన్‌

ఎయిర్‌టెల్‌ రూ.299 ట్రూలీ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ ఇటీవల రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. గతంలో ఈ ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందించేది. ఎయిర్‌టెల్ రూ. 299 రీఛార్జ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజువారీ హై-స్పీడ్ డేటా కోటాను దాటిన తర్వాత 64 కేబీపీఎస్‌ వేగంతో రోజుకు 2 జీబీ డేటా మరియు 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్‌ థాంక్స్ రివార్డ్‌లలో అన్‌లిమిటెడ్‌ 5 జీ డేటా, 3 నెలల  అపోలో సభ్యత్వంతో పాలు వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు.

రూ.319 ప్లాన్‌

ఈ ప్లాన్ ద్వారా రోజువారీ హై-స్పీడ్ డేటా కోటా, అపరిమిత వాయిస్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, 1 నెల చెల్లుబాటుతో 64 కేబీపీఎస్‌ వేగంతో రోజుకు 2జీబీ డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్‌ థాంక్స్ రివార్డ్‌లలో అన్‌లిమిటెడ్‌ 5 జీ డేటా, 3 నెలల  అపోలో సభ్యత్వంతో పాలు వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు.

రూ.359 ప్లాన్‌

మీరు వినోద ప్రయోజనాల కోసం చూస్తుంటే రూ.359 ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాన్‌ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేతో కలిసి వస్తుంది. అలాగే సోనీ లివ్‌, లింగోగేట్‌ ప్లే, ఫ్యాన్‌ కోడ్‌, ఇరోస్‌ నై 15 కంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో వస్తుంది. ఈ ప్లాన్ రోజువారీ హై-స్పీడ్ డేటా కోటా, అన్‌లిమిటెడ్ వాయిస్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1 నెల చెల్లుబాటును దాటిన తర్వాత 64 జీబీ వేగంతో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే ఎయిర్‌ థ్యాంక్స్‌ ప్లాన్స్‌ కూడా ఈ ప్లాన్‌లో మిళితమై ఉన్నాయి. అలాగే ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా వేసుకుంటే 2 జీబీ డేటా కూపన్‌ కూడా అదనంగా వస్తుంది.

రూ.549 ప్లాన్‌

ఈ ప్లాన్‌ ద్వారా మీరు రోజుకు 2 జీబీ డేటాను 64 కేబీపీఎస్‌ స్పీడ్‌తో మీరు 56 రోజుల వాలిడిటీ పొందవచ్చు. అంతే కాకుండా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు.ఎయిర్‌టెల్‌ థాంక్స్ రివార్డ్‌లలో అన్‌లిమిటెడ్‌ 5 జీ డేటా, 3 నెలల  అపోలో సభ్యత్వంతో పాలు వింక్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తారు. అలాగే ఉచిత హలో ట్యూన్స్‌ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

రూ.839 ప్లాన్‌

మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి వినోద ప్రయోజనాల కోసం చూస్తుంటే ఎయిర్‌టెల్ 84 డే ప్లాన్ మీకు అవసరమైన ఓటీటీ ప్రయోజనాలను అందిస్తుంది. ఎయిర్‌టెల్ 839 ప్లాన్ ద్వారా రోజువారీ 2 జీబీ హై-స్పీడ్ డేటా కోటా, అన్‌లిమిటెడ్ వాయిస్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ అపరిమిత 5 జీ డేటాతో పాటు 15 ప్లస్‌ ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ మూడు నెలల వ్యాలిడిటీతో వస్తాయి. అలాగే వింక్‌ మ్యూజిక్‌తో పాటు ఉచిత హలో ట్యూన్స్‌ సదుపాయం కూడా ఉంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి