ఉచితంగానే రూ.25 వేలు పొందండి.. ఇలా చేస్తే చాలు!

ఉచితంగానే రూ.25 వేలు పొందండి.. ఇలా చేస్తే చాలు!

ఈ కాంటెస్ట్‌లో 15 సంవత్సరాల వయసు లోపు వారు జూనియర్ గ్రూప్‌లో, 15 సంవత్సరాల పైబడిన వారు సీనియర్ గ్రూప్‌లో పాల్గొనవచ్చు.

అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఎలా అని అనుకుంటున్నారా? మీరు ఉచితంగానే రూ. 25 వేలు పొందే వెలుసుబాటు లభిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఒక కాంటెస్ట్ నడుస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిస్తే.. డబ్బులు మీవే.

వైజాగ్‌లో మాత్రమే ఈ కాంటెస్ట్ నడుస్తుంది. అందువల్ల అక్కడి వారు ఈ అవకాశం సొంతం చేసుకోవచ్చు. విశాఖ నగరాన్ని పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో ఎకో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమాలో భాగంగా ఎకో - వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ కార్యక్రమం ఉంటుంది.

జనవరి 21వ తేదీన ఉదయం 8 గంటలకు పోర్ట్ స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్స్ నందు రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ భాగ స్వామ్యంతో నిర్వహిస్తామని చిత్రకారులకి జీవీఎంసీ కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ అన్నారు.

విశాఖ నగరంలో ప్రజలు అందరూ ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ అనే ఐదు అంశాల నందు అవగాహన కలిగి విశాఖ నగర అభివృద్ధికి సహకరించినట్లయితే మన నగరం పర్యావరణహితమైన పరి పూర్ణ విశాఖ నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ప్రజల అవగాహనకు స్వచ్ఛంద సంస్థలను చైతన్య పరుస్తూ ఎకో వైజాగ్ అభివృద్ధి దిశగా అనేక కార్యక్రమాలు జీవీఎంసీ నిర్వహిస్తోందని తెలిపారు.

కార్యక్రమాలలో భాగంగా జనవరి 21 ఆదివారం ఉదయం 8 గంటలకు నేషనల్ హైవేకు సమీపాన పోర్ట్ స్టేడియం లోగల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్స్ నందు ఎకో వైజాగ్ మెగా ఆర్ట్స్ కాంటెస్ట్ ను రేంజర్ ఫోర్స్ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో జీవీఎంసీ నిర్వ హిస్తారు.

ఈ కాంటెస్ట్ లో 15 సంవత్సరాల వయసు లోపు వారు జూనియర్ గ్రూప్‌లో 15 సంవత్సరాల పైబడిన వారు సీనియర్ గ్రూప్ లో పాల్గొనవచ్చని, సీనియర్ గ్రూప్ నందు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గెలుపొందిన వారికి 25,151 వేల రూపాయల నగదును అందిస్తారు.

అలాగే జూనియర్ గ్రూప్ నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలు పొందిన వారికి 15,107 వేల రూపాయల నగదును, రెండు గ్రూపులలో 50 మందిని ఎంపిక చేసి ప్రోత్సాహక బహుమతులు అందిస్తారు.

చిత్రలేఖనంపై ఆసక్తి కల ఔత్సాహికులు వారి సృజనాత్మక తను వెలికి తీసి ఎకో వైజాగ్ కు సంబంధించిన అంశాలను జోడిస్తూ అద్భుతమైన చిత్రాలను వేసి ఎకో వైజాగ్ అభివృద్ధికి సహకరించుటకు జనవరి 20వ తేదీలోగా ఉచితంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఈ మెగా ఆర్ట్ కాంటెస్ట్ నందు పాల్గొనాలని పేర్లను నమోదు చేసుకునేందుకు సూచించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసుకోవచ్చని, వివరాలకి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా స్వచ్చంద సంస్థ ప్రతినిధులను 9000086861 / 8555058575 మొబైల్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి