department of postals is providing an opportunity to get rs six thousand through deen dayal sparsh yojana scholarship

department of postals is providing an opportunity to get rs six thousand through deen dayal sparsh yojana scholarship

విద్యార్థులకు వివిధ సంస్థలు Scholarship సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దానిలో భాగంగానే తపాలాశాఖ ‘దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన స్కాలర్‌ షిప్‌’ కోసం పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది. ఆరో తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌ షిప్‌ కు దరఖాస్తు చేసుకోవచ్చు. History, Sports, Science, Social, General Knowledge, స్టాంపులు వంటి సబ్జెక్టులో విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షిస్తారు. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటలీ) వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ప్రతీ ఏటా తపాలాశాఖ దీన్‌ దయాళ్‌ స్పర్శ్‌ యోజన ఈ పోటీలను నిర్వహిస్తోంది.

అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులు కూడా వీటికి పోటీ పడవచ్చు. దరఖాస్తులు తమ పాఠశాల హెచ్‌ఎం పేరు మీద సంబంధిత రీజనల్‌ ఆఫీస్‌కు తమ దరఖాస్తును పంపించాలి.

దీనికి మీకు సమీపంలోని పోస్టాఫీస్ లో రూ.200 చెల్లించి.. ఫిలాటలీ క్లబ్‌ అకౌంట్‌ తెరవాలి. విద్యార్థి పేరుతో గానీ, పాఠశాల హెచ్‌ఎంల పేరుతోగానీ ఈ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. అకౌంట్‌ ఓపెన్‌ చెయ్యగానే రూ.180 విలువ చేసే తపాలా బిళ్లలు ఇస్తారు. ఇవి పోటీ పరీక్షలు రాసేందుకు విద్యార్ధులకు ఉపయోగపడతాయి. ఇక పరీక్ష తేదీ ఎప్పుడూ అనే వివరాలను పాఠశాల హెచ్ ఎం కు పంపిస్తారు. ప్రదానోపాధ్యుయుడిని సంప్రదించి పరీక్ష రోజు తెలుసుకొని.. ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రెండు దశల్లో పరీక్షలు ఉంటాయి.

ప్రలిమినరీ పరీక్ష అండ్ ప్రాజెక్టు వర్క్‌ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో 50 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో అర్హత సాధించిన వారిని సెకండ్ స్టేజ్ కు ఎంపిక చేస్తారు. ఇక్కడ ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. 16 స్టాంపులతో 4 నుంచి 5 పేజీలకు మించకుండా ప్రాజెక్టు వర్క్‌ పూర్తిచేయాలి. ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తయిన తర్వాత సంబంధిత తపాలాశాఖ రీజనల్‌ ఆఫీస్‌ అడ్రస్‌కు పోస్టు ద్వారా సమర్పించాలి. రెండు దశల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ , హైదరాబాద్‌లోని తపాలాశాఖ సర్కిల్‌ కార్యాలయ అధికారులు ఎంపిక చేస్తారు. ఒక్కో తరగతి నుంచి 10 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 40 మందిని ఎంపిక చేసి.. ప్రతీ నెల రూ.500 చొప్పును ఏడాదికి ఒకొక్కరికీ రూ.6వేలు చెల్లిస్తారు.

ఈ సాయం పొందేందుకు విద్యార్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేరుతో తపాళాశాఖలో జాయింట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి విద్యార్థి ఖాతాలో జమ అయిన అమౌంట్ డ్రా చేసుకోవచ్చు.

Click here for complete details

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి