Lakshmi Parvathi | దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్.. సినిమా, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. సొంత వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. అత్యంత అవమానకర రీతిలో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ గా చక్రం తిప్పిన సీనియర్ నందమూరి తారక రామారావు కాలం నుండే ఉన్నాయి. అయితే ఒక్కడ రెండో వివాహం వెనక ఒక్కో బలమైన కారణం దాగి ఉంది.
నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర సీమ నాటి తరం అగ్రహీరో. ఆయన సినీమా చరిత్రలో నిలిచిపోయేలా ఉండేవి. ఆయన తన 20 వ ఏటా మేనమామ కూతురు బసవ తారకం ను వివాహామాడారు.ఈ దంపతులకు 12 మంది సంతానం. అందులో 8 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అయితే సతీమణి క్యాన్సర్ వ్యాధి తో పోరాడి చివరకు 1984 సెప్టెంబర్ 1 ను మద్రాస్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆమె 59 సంవత్సరాలకే తనువు చాలించారు.ఆ తరువాత లక్ష్మీపార్వతి చేసుకున్నాడు.
అయితే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ప్రత్యర్థి వర్గం సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు.అలాంటి ఎన్టీఆర్.. తనను విడిచిపెట్టి వెళ్లిపోయి అన్యాయం చేశారని లక్ష్మీపార్వతి కన్నీటి పర్యంతమయ్యారు.తాజాగా, ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తర్వాత జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లు లక్ష్మీపార్వతి వివరించారు. ఎన్టీఆర్ తన పట్ల ఆకర్షితులవడానికి తనేమీ పెద్ద అందగత్తెనేమీ కాదనీ, కేవలం ఆత్మీయతే తామిద్దరిని కలిపిందని చెప్పుకొచ్చారు.
Also Read : ఐశ్వర్య రాయ్ కి వింత వ్యాధి, అందుకే అలా అయిపోయిందా..
ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక’ చిత్రం షూటింగ్ జరుగుతుంటే తను ఆ షూటింగ్ స్పాటుకు వెళ్లాననీ, అక్కడ ఎన్టీఆర్‌తో పాటు లక్ష్మిగారు కూర్చుని వున్నట్లు చెప్పారు. కొద్దిసేపటికి ఎన్టీఆర్ వద్ద శెలవు తీసుకుంటూ ఇక నేను వెళ్లొస్తానని చెప్పగానే మళ్లీ ఎప్పుడు వస్తారు అని అడిగారనీ, ఆ మాటతో ఆయనలో తన పట్ల వున్న ఆత్మీయత వెల్లడైందన్నారు.అలా తమ మధ్య మొదలైన అనుబంధం క్రమేపీ బలపడిపోయిందనీ, నరసరావుపేటలో తను నివాసముంటున్న ఇంటికి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ పెట్టించి దాని బిల్లు రూ.3 లక్షలు ఆయనే కట్టారని గుర్తు చేసుకున్నారు. దీన్నిబట్టి ఆయన తన పట్ల ఎంత ప్రేమను చూపించారో అర్థమవుతుందనీ, అలా ఒకరోజు తనను పెళ్లాడుతానంటూ ఆయనే స్వయంగా ప్రపోజ్ చేశారని చెప్పారు.
Also Read : కుష్బూ కూతురి అందాలు చూస్తే షాక్ అవుతారు..?