Aishwarya Rai | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమెకు ఇప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. తన అంద చందాలతోనే కాదు నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ను సంపాదించుకుంది. ఈమె ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కూడా ఐశ్వర్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ఇక్కడ కూడా ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. అయితే ఐశ్వర్య గురించి ఈ మధ్య వార్తల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది.
ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ క్రమంలో ఐశ్వర్య రాయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య ఏ అనారోగ్య సమస్యలతో పోరాడుతుందో ప్రస్తావించలేదు. బరువు పెరుగుతోందని.. తగ్గేందుకు డైట్ పాటించడం, ఇతర మందులను తీసుకోలేకపోతున్నట్లుగా పోస్ట్ పేర్కొంది. ఈ క్రమంలో అభద్రతా భావంతో వీలైనంత వరకు శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులను ఎంచుకుంటుంన్నదని తెలిపింది. పారిస్ ఫ్యాషన్ వీక్-2024లో ఐశ్వర్య రాయ్, అలియా భట్ ఇద్దరు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు.
ఇదిలా ఉండగా.. ఐశ్వర్య రాయ్ తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య ఏ కార్యక్రమానికి వెళ్లినా కూతురు ఆరాధ్యతోనే వెళ్తున్నది. బచ్చన్ ఫ్యామిలీతో కనిపించడం లేదు. దాంతో బచ్చన్ ఫ్యామిలీ ఆమెను పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలోనూ బచ్చన్ ఫ్యామిలీ, ఐశ్వర్య వేర్వేరుగా వచ్చారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నారనే అనుమానాలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. విడాకులపై అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ఇద్దరూ స్పందించలేదు.