Relationship Tips | నిజాన్ని పసిగట్టకపోవడం.. అబద్ధాన్ని అంచనా వేయలేకపోవడం జీవితంలో సర్వసాధారణం. కొందరు అబద్ధాన్ని చాలా సులువుగా నమ్మేస్తారు.. మాటలు నేర్చిన మాటకారికి.. ఇతరులను మోసం చేయడం పెద్ద కష్టమేమి కాదని పెద్దలు అంటుంటారు.. అబద్ధం వ్యాపించినంత సులువుగా నిజం వెళ్లలేదని అంటుంటారు.. పూర్తిగా నమ్మివారు.. వారిని మోసం చేసే వరకు గుర్తించలేరట.. వారు చెప్పే మాటల వెనక ఉన్న దాగి ఉన్న విషపు ఆలోచనలు పసిగట్టలేరు.. కానీ అబ్బాయిలు అబద్ధం చెబితే కనిపెట్టడం మరింత సులభమట.
అదెలాగా అంటారా.. అసలు విషయం ఏంటంటే.. అమ్మాయిలకు ఆలోచన శక్తి ఎక్కువ.. ఇతరుల ముఖ కదలికలు చూసి వారున్న పరిస్థితిని అంచనా వేయగల్గుతారు.. చాలా తెలివిగా ఆలోచిస్తారు.. తమ చుట్టు ఉండే పరిస్థితులు గురించి అవగాహనకు వస్తారు. అలాగే.. తమ జీవిత భాగస్వామి.. ప్రియుడు అబద్ధాలు చెప్తే కనిపెట్టడం కూడా సులభమే.. మీ జీవితంలో మీ భాగస్వామి లేదా ప్రియుడు మీకు చెప్పే విషయాలు అబద్ధమా.. నిజమా అనేది తెలుసుకోవడానికి ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఒక స్టడీ ప్రకారం 20 శాతం మంది మగవారు, 13 శాతం మంది పెళ్ళైన మహిళలు ఇతరులతో సంబంధం పెట్టుకున్నట్లు వెల్లడించారు. సగటున 16 శాతం మంది మోసం చేస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది. అయితే ఈ స్టడీ ప్రకారం మగవాళ్లే ఎక్కువగా మోసం చేస్తున్నట్లు తేలింది. మరొక స్టడీ ప్రకారం.. 9 శాతం మంది మహిళలు, 17 శాతం మంది మగవారు తమ భాగస్వాములకి నమ్మకద్రోహం చేశారని తేలింది. ఇందులో మరలా ఇతరులతో సంబంధం పెట్టుకున్న వారిని లిస్ట్ అవుట్ చేస్తే 15 శాతం మంది మహిళలు, 27 శాతం మంది మగవారు శారీరక సంబంధాలు పెట్టుకున్నారని తేలింది.
సీనియర్ నటి సీత ఇంట్లో నగల దొంగతనం, వాటి విలువ ఎంతంటే..?
సగటున 21 శాతం మంది మోసం చేస్తున్నారు. ది ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ 2010 నుంచి 2016 వరకూ వివిధ వయసు వారి మీద చేసిన జనరల్ సోషల్ సర్వే ప్రకారం.. అన్ని వయసు మగవారు తమ భాగస్వాముల్ని మోసం చేస్తున్నట్లు తేలింది. అయితే 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న అబ్బాయిలు నిజాయితీపరులని తేలింది. ఇక మహిళల్లో 60 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న వారు తమ భర్తలను మోసం చేసినట్లు తేలింది. ఇది సగటున 16 శాతంగా ఉంది. మహిళలతో పోలిస్తే భార్యలను మోసం చేసే మగవారు 26 శాతం మంది ఉన్నారు. మగవారిలో 70 నుంచి 79 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా భార్యలను మోసం చేస్తున్నారని తేలింది.
కర్నూలు జిల్లాలో ఘోర విషాదం, స్నేహితుడి పెళ్లిలో అల్లరి చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.