గుండెపోటు..వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికల లక్షణాలను చూపిస్తుంది. వీటిని సమయానికి గుర్తించి వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యమైంది. గుండెపోటు హఠాత్తుగా వచ్చే సమస్యగా కనిపించినప్పటికీ, చాలాసార్లు శరీరం ముందే హెచ్చరికల సంకేతాలను ఇస్తుంది. అయితే ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా పలువురు వ్యక్తులు చావు వచ్చి అప్పటికప్పుడు పిలిచినట్లుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్నారు. నెలల పసికందు నుంచి ఉడుకు రక్తం యువత వరకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
గతంలో ఎన్నడూలేనిది ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక యువత ఆందోళన చెందుతుంది. తాజాగా ఏపీలో మరో సంఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి పెళ్లికి వెళ్లి, స్టేజ్‌పై నవ దంపతులకు శుభాకాంక్షలు చెబుతుండగా మృత్యువు పిలిచింది. అంతే..అక్కడికక్కడే గుండెపోటుతో ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో ఓ జంట పెళ్లి వేడుక జరుగుతుంది. నూతన దంపతులకు పలువురు స్టేజ్‌పైకి వచ్చి కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇంతలో వంశీ అనే వ్యక్తి తన స్నేహితులు కొంత మందితో స్జేజ్‌పైకి వచ్చాడు. నవవధువరులకు వారంతా గిఫ్ట్ ఇచ్చారు. వారిచ్చిన బహుమతిని వరుడు తెరచి చూస్తుండగా.. స్నేహితులంతా ఆనందంగా నవ్వుతూ చూడసాగారు. ఇంతలో వంశీ ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపు అక్కడే ప్రాణాలొదిలాడు. వంశీ అమెజాన్‌లో ఉద్యోగి. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న వంశీ.. స్నేహితుడి పెళ్లికి వచ్చి ప్రాణాలొదలడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగి పోయారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వరుడు బహుమతిని విప్పుతుండగా.. వంశీ తన ఎడమ వైపుకు వంగి బ్యాలెన్స్ కోల్పోవడం కనిపిస్తుంది. వెంటనే అతన్ని ధోన్ సిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు వంశీ చనిపోయినట్లు ప్రకటించారు.
💔 Tragedy Strikes at Wedding:
— amaravatinews24 (@amaravatinews24) November 21, 2024
An Amazon employee dies on stage of a heart attack during his friend's wedding in #AndhraPradesh .
Doctors emphasize rising cardiac risks among youth due to stress, pollution & lifestyle changes.#AmazonEmployee #Kurnool #heartattack #Amaravati pic.twitter.com/X9ldLtMkI6