Chiru Surekha | తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ కోసం కొన్ని ప్రత్యేకమైన పేజీలు రాసిపెట్టి ఉంటాయని చెప్పవచ్చు.. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు.. ఆయన ఎదిగే క్రమంలో ఎందరో అవమానించారు, ఎన్నో ఆపసోపాలు పడ్డారు.. వాటన్నింటిని దిగమింగుకొని తను అనుకున్నది సాధించాడు. నటనే ప్రథమావధిగా నమ్ముకొని ఇండస్ట్రీలోనే మెగాస్టార్ గా మారారు.. అలాంటి మెగాస్టార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం.. మెగాస్టార్ కు ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్..
అయితే అభిమానులు ఈ ఖాళీ సమయంలో తమ హీరోలకు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్‌ని బయటకు తీస్తూ ఒక్కొక్కటిగా వైరల్ చేస్తూ వచ్చారు. అవి నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతుల యంగ్ ఏజ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో చిరంజీవి వింటేజ్ హెయిర్ స్టైల్ తో తన సతీమణితో కలిసి తీక్షణంగా చూస్తున్నారు.చిరంజీవి – సురేఖల పెళ్లి 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఇటీవలే 41 ఏళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న ఈ మెగా దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
ఇక ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన చిరంజీవి తన ఫ్యామిలీకి చాలా అండగా నిలిచాడు. అలాగే అవసరమైనప్పుడు సినీ పరిశ్రమకు కూడా తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతుండగా, ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రూవ్ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.