Chiranjeevi Daughter | టాలీవుడ్ లో స్వయంకృషితో తిరుగులేని స్థాయికి ఎదిగిన నటుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు ఎవరైనా సరే. ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా ప్రతిభతో సినీ పరిశ్రమలో అద్వితీయంగా ఎదిగి, టాలీవుడ్ ని శాసించిన చిరు రాజకీయాల్లోకి వెళ్లినా సరే, తెలుగు పరిశ్రమలో ఆయన మాట వేదవాక్కుగా చాలా మంది భావిస్తూ వస్తున్నవాళ్ళు ఉన్నారు. అలాగని అందరిపై పెత్తనం చెలాయించాలన్న ఆలోచన అసలు ఆయనకు రానే రాదు. ఇంకా చెప్పాలంటే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే కరిగిపోతారు.
కష్టాల్లో ఉన్నవాళ్లకు చిరంజీవి సాయం చేయడంతో పాటు వాళ్ళ బాగోగుల గురించి అనుక్షణం తపిస్తారు. చిరంజీవి ఒక్కరే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వాళ్ళే. ఆయన కుమార్తెలు సుస్మిత,శ్రీజ, కుమారుడు రామ్ చరణ్ తండ్రి ఆలోచనలను పుణికి పుచ్చుకున్నారని చెప్పవచ్చు.అయితే ఆయన పెద్ద కుమార్తె సుస్మిత గురించి అందరికీ తెలిసిందే. ఆమెను చెన్నైలో స్థిరపడినటువంటి వ్యాపారవేత్త కుటుంబంలోకి ఇచ్చాడు..వీరి కుటుంబం రాయలసీమ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడ్డారు..
ప్రముఖ వ్యాపారవేత్త అయినా ఎల్వీ రామారావు పెద్ద పేరు మోసిన బిజినెస్ మాన్.. ఆయన అప్పట్లోనే అమెరికా, థాయిలాండ్, జపాన్, సింగపూర్ వంటి దేశాలతో వ్యాపార లావాదేవీలు నడిపేవారట. ఆయన కుమారుడు ఎల్వి ప్రసాద్ చంద్రిక దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్.. ఈ విష్ణు ప్రసాద్ కి చిరంజీవి తన కూతురు సుస్మితను ఇచ్చి వివాహం చేశారు. విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగాల్లో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశారు. విదేశాల్లో చదువు పూర్తయ్యాక వారి వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు.
విష్ణు ప్రసాద్ తాతయ్య మొదలుపెట్టిన పామాయిల్ వ్యాపారం తన తండ్రి సారథ్యంలో కొంత డెవలప్ అయింది, ఆ తర్వాత విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటినుంచి వ్యాపారం రెండింతల పెరిగిపోయింది. ప్రపంచ దేశాలకే మేలురకం పామ్ ఆయిల్ ఎగుమతి చేయడం మొదలు పెట్టిన విష్ణు ప్రసాద్ కోటాను కోట్లకు అధిపతి.. అయితే ఈ జంటకి ఇద్దరు అమ్మాయిలు.. ప్రస్తుతం సుస్మిత సినీ రంగంలో అడుగు పెట్టింది. చిరు మరియు రామ్ చరణ్ సినిమాలకు స్టైలిష్ గా వ్యవహరిస్తోందంటే కారణం విష్ణు ప్రసాద్. తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది సుస్మిత.
Also read : ఉదయం లేవగానే భార్యాభర్తలు చేస్తే చాలు.. మీ మధ్య ప్రేమ రెట్టింపవుతుంది.