Parvathi devi: పార్వతి దేవి గర్భం దాల్చకుండా శపించింది ఎవరో తెలుసా..! ముగ్గురు పిల్లలకు తల్లి ఎలా అయ్యింది.
Parvathi devi: పార్వతి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి, అశోక సుందరి, జ్యోతి, మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. అయితే శివుడు, పార్వతి పిల్లలైన గణేషుడు, కార్తికేయ, అశోక్ సుందరి గురించి చాలా కథలు ప్రాచుర్యం పొందాయి. నిజానికి ముగ్గురూ శివపార్వతుల పిల్లలే. కానీ పార్వతీమాత తొమ్మిది నెలల పాటు ఏ ఒక్కరినీ తన కడుపులో మోయలేదు. శివపురాణం ప్రకారం, తల్లి పార్వతికి ఉన్న శాపం కారణంగా గర్భవతి అయిన ఆనందాన్ని పొందలేకపోయిందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం వెనుక ఇంత రీజన్ ఉందా..?
శివ పురాణం ప్రకారం, ఒకసారి వజ్రంగ్ కుమారుడైన తారకాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టాడట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సంతోషించి తారకాసురుడికి కావలసిన వరం ఇచ్చాడట. తారకాసురుడు బ్రహ్మదేవుని వరం కోరి ప్రపంచంలో తనచే సృష్టించినది ఏదీ తన కంటే బలంగా ఉండకూడదని, రెండవ వరం అతను ఎప్పటికీ అమరుడిగా ఉండాలని అన్నాడట. తారకాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందిన వెంటనే, అతను ప్రపంచం మొత్తంలో బీభత్సం సృష్టించడం ప్రారంభించాడట. అతను స్వర్గంలోని దేవతలతో పాటు భూమి పై సాధారణ మానవులను, ఋషులను హింసించడం ప్రారంభించాడట. తారకాసురుడు స్వర్గపు రాజు ఇంద్రుడిని భయపెట్టి అతని వాహనమైన ఐరావత ఏనుగు, నిధి, తొమ్మిది తెల్ల గుర్రాలను లాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. భయంతో ఋషులు తారకాసురుడికి కామధేనువు ఆవును కూడా ఇచ్చారట. అయితే దీని తర్వాత కూడా అతని బీభత్సం పెరుగుతూ వచ్చిందని పురాణాల మాట.
మూడు లోకాల పై పట్టు సాధించిన తర్వాత, తారకాసురుడు దేవతలను స్వర్గం నుండి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వచ్చి తారకాసురుని నుండి మా ప్రాణాలను రక్షించమని వేడుకున్నారట. దేవతలను బాధపెట్టడం చూసి బ్రహ్మాదేవుడు కూడా బాధపడి, ఈ పరిస్థితిలో తాను ఏమీ చేయలేనని దేవతలకు చెప్పాడట. తారకాసురుని తపస్సుకు సంతోషించి, అతనికి అత్యంత బలవంతుడనే వరం ఇచ్చానని దేవతలకు తెలిపాడట బ్రహ్మ. దేవతలను విచారించిన బ్రహ్మదేవుడు తారకాసురుడు శివుని పిల్లల ద్వారానే నాశనం అవుతాడని వారికి పరిష్కారం చెప్పాడట. ఇది విన్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని భస్మం చేసుకుంది. కాబట్టి ఇది ఎలా సాధ్యం అవుతుంది ? అప్పుడు సతీదేవి మళ్లీ పార్వతిగా పుడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడట.
Also Read: సంతానం లేని దంపతులు ఈ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుంటే చాలు సంతానం కలుగుతుంది.
ఆ తర్వాత శివుడితో వివాహం జరగనుందని. ఆ తర్వాత, శివపార్వతులకు కలిగే బిడ్డ ద్వారా తారకాసురుడు చంపబడతాడని చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. మహాదేవుడు సదా తపస్సులో నిమగ్నమై ఉండేవాడు కాబట్టి పార్వతి దేవి బ్రహ్మదేవుని సహాయం కోరింది. తల్లి పార్వతి తన హృదయంతో, ఆత్మతో శివునికి అంకితం అయ్యింది. కాబట్టి దేవుళ్లు, దేవతలందరూ శివ హృదయాన్ని గెలుచుకోవడంలో ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. శివపార్వతుల వివాహం తరువాత, దేవతలు పార్వతి దేవికి సహాయం చేయడానికి కామదేవుని పంపారట. శివుని తపస్సును భగ్నం చేయడానికి దేవతలు కామదేవుడిని పంపారు. అప్పుడు కామదేవుడు తన భార్య రతితో కైలాసానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేశాడు.
Also Read: అప్పులతో బాధపడుతున్నారా..? ఏడు శనివారాలు ఇలా పూజ చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి.
తపస్సు భగ్నం చేయడంతో శివుడు కోపించి కామదేవుడిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేశాడు. పురాణాల ప్రకారం కామదేవుని భార్య రతి తన భర్తను కాల్చివేసి చంపడం చూసి దుఃఖించింది. ఆ తర్వాత రతీదేవి పార్వతీదేవితో ఇలా చెప్పిందట మీ తపస్సును గౌరవించడానికే నా భర్త కామదేవుడు వచ్చాడని. నీ వల్ల నేను నా భర్తను కోల్పోవడమే కాకుండా తల్లి అయే ఆనందాన్ని కూడా కోల్పోయానని బాధించిందట. ఆ తర్వాత రతీదేవి తన భర్త చితాభస్మాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నేను తల్లిని అయ్యానన్న ఆనందం ఎలా లేకుండా పోయిందో, అలాగే పార్వతి తన కడుపులోంచి ఏ బిడ్డకు జన్మనివ్వకూడదని శపించింది. శివ పురాణం ప్రకారం శివుని కోపం తగ్గిన తర్వాత దేవతలందరూ తారకాసురుడికి ఇచ్చిన వరం గురించి తెలియజేశారు. కామదేవుని భార్య రతి కామదేవుడిని తిరిగి బ్రతికించమని శివుడిని అభ్యర్థించింది. ఆ తర్వాత శివుడు కామదేవున్ని తిరిగి బ్రతికించాడు.