ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం ఈశ్వరుడుకు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ ఆలయం అనికూడా సూచిస్తారు. ఘర్నేశ్వర అనే పదానికి “కరుణ ప్రభువు” అని అర్ధం. హిందూధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశంగా పరిగణిస్తారు. అయితే ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రానికి సంబంధించిన పురాణ కథనం ప్రకారం దక్షిణ దేశంలోని దేవగిరి పర్వతం సమీపంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి నివసించేవాడు. ఈ దంపతులకు సంతానం లేదు.
దీంతో ఇద్దరూ ఆందోళన చెందారు. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య అయిన సుదేహ తన భర్తను తన చెల్లెలు ఘుష్మతో మళ్ళీ వివాహం చేసింది. ఘుష్మ గొప్ప శివ భక్తురాలు. పరమశివుని దయతో ఆమెకు ఆరోగ్యవంతమైన కొడుకు పుట్టాడు. అయితే సుదేహకు తన చెల్లెలు ఘుష్మా కుటుంబం నవ్వుతూ ఉండడం.. పిల్లాడితో ఆడుకోవడం చూసిన సుదేహలో తన చెల్లెలుపై అసూయ మొదలైంది. దీంతో ఘుష్మ బిడ్డను చంపి చెరువులో పడేసింది. భక్తురాలి కుమారుడిని మళ్ళీ బతికించిన శివుడు.. ఈ విషయం తెలుసుకున్న ఘుష్మ ఎంతగానో దుఃఖించింది.
అయితే శివుడికి పూజకు వేళ అవ్వడంతో తన దుఃఖాన్ని మరచి మళ్లీ యథావిధిగా శివపూజలో మునిగిపోయింది. మహాదేవుడు తన భక్తురాలి భక్తికి సంతోషించాడు. శివుని ఆశీర్వాదంతో ఘుష్మ కుమారుడు మళ్లీ బ్రతికాడు. లోక కల్యాణం కోసం ఈ ప్రదేశంలో శాశ్వతంగా నివసించాలని ఘుష్మ శివుడిని ప్రార్థించింది. శివుడు ఘుష్మ కోరికను అంగీకరించిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసించడం ప్రారంభించాడు. తాను ఇక్కడ ఎల్లప్పుడూ నివసిస్తాను.. నీ పేరుతో ఘుష్మేశ్వర్ అని పిలువబడుతూ పూజలను అందుకుంటాడు అని వరం ఇచ్చాడు.
సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే క్షేత్రం.. ఘుష్మేశ్వర్ జ్యోతిర్లింగ సమీపంలో ఒక సరస్సు కూడా ఉంది. ఘుష్మ చేసిన శివలింగాలను నిమజ్జనం చేసేది ఇదే చెరువు. ఈ నది ఒడ్డున ఆమె తన కొడుకును సజీవంగా పొందింది. జ్యోతిర్లింగంతో పాటు ఈ సరస్సును కూడా భక్తులు సందర్శిస్తారు. ఘృష్ణేశ్వర స్వామి దర్శించుకున్న భక్తుల కోరికలన్నీ తీరుస్తాడు. సంతానంని దంపతులు ఇక్కడ దర్శించి పూజలు చేస్తే సంతానం పొందుతారు .జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని నమ్మకం.