కొన్ని కొన్ని సార్లు కస్టమర్లు చిరాకు పడినా కూడా సిబ్బంది మాత్రం ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పడం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరో కోవలోకి చెందినది. ఏకంగా షాపింగ్ కి వచ్చిన మహిళా కస్టమర్ ను దారుణంగా కొట్టారు సిబ్బంది. అయితే 64 కళల్లో చోరకళ కూడా ఒకటి. ఇంట్లో, షాపులో లేదా చోట మరేదైనా.. దొంగలు దొంగతనానికి పాల్పడ్డారంటే.. దొరికినకాడికి దోచుకెళ్లకుండా ఉండలేరు. జన సమూహం ఉన్నాసరే.. రకరకాల టెక్నిక్స్‌తో దోచుకెళ్లిపోతారంతే.!
ఇక ఈ మధ్యకాలంలో పలువురు మహిళలు కూడా చేతివాటం చూపిస్తున్నారు. నగలు, చీరలు, చిన్నచిన్న వస్తువులు.. ఇలా పక్కనున్నవారిని ఏమార్చి దోచేస్తున్నారు. దొరకనంత వరకు ఏ దొంగ అయినా దొరే.. కానీ దొరికితే మాత్రం చితకబాదేస్తారు. ఇలాగే దెబ్బకు తగిలించుకుంది ఓ లేడీ దొంగ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వస్త్ర దుకాణానికి ఒక అమ్మాయి షాపింగ్ కోసం వచ్చింది. జీన్స్ ప్యాంట్స్ ట్రయిల్ కోసం అడిగింది.
టెస్టింగ్ కోసం డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తర్వాత డ్రస్సులేవి కొనకుండా మెల్లిగా జారుకుంటుంటే.. అనుమానమొచ్చి సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఆమె ప్యాంట్ విప్పే ప్రయత్నం చేయగా.. దెబ్బకు కంగుతిన్నారు. ఎందుకంటే.! ఆమె దొంగతనం చేసింది జీన్స్ ప్యాంట్లను. ఒంటిపైనే ఆ ప్యాంట్స్ ధరించి.. అక్కడ నుంచి మెల్లిగా జారుకోవాలనుకుంది.. కానీ అడ్డంగా దొరికిపోయింది.
ఇక దొంగతనం చేసిందంటే.. సిబ్బంది ఊరుకుంటారా.. ఆమె చెంపలు వాయించి వదిలిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ అమ్మాయి పరారైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు అవ్వగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి లేట్ ఎందుకు ఓసారి ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.
— Second before disaster (@NeverteIImeodd) July 12, 2024