హర్షపై లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే రీసెంట్గా సైబరాబాద్ సీపీని కలిసిన బాధితురాలు హర్షసాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది.
అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం కూడా వ్యక్తం చేసింది. వారం రోజులుగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు హర్షసాయి హర్షసాయి కోసం గాలిస్తున్నామంటున్న నార్సింగి పోలీసులు. కాగా ఆ యువతే అతని డబ్బుల కోసం వేధిస్తోందని అంటున్నాడు హర్ష సాయి తరపు లాయర్.
ప్రేమించమని , పెళ్లి చేసుకోమం వేధించడంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసిందని బాధితురాలి లాయర్ అంటున్నారు. ఇక హర్షసాయి గురించి తెలియని వారు ఉండరేమో.. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలిచాడు. యూట్యూబ్‌లో, ఇన్ స్టా గ్రామ్‌లో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆవీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాపులర్ అయ్యాడు.
అలాగే యూట్యూబ్ నుంచి బాగానే సంపాదించాడు. వీటితో పాటు మొన్నామధ్య ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇక ఇప్పుడు ఇలా రేప్ కేసులో ఇరుక్కున్నాడు హర్ష సాయి.