బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచినవి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే.
అయితే రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని మెహన్‌గఢ్‌లో ఓ వ్యక్తి తన స్థలంలో బోరుబావి వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. యంత్రాలు తీసుకువచ్చి బోరుబావి తీస్తుండగా.. ఒక్కసారిగా గంగపైకి పొంగి వచ్చింది. భారీ ఉధృతితో నీరు పైకి ఉబికిరావడంతో పెద్ద గుంత ఏర్పడి అందులో బోరుబావి యంత్రం పడిపోయింది. అతిపెద్ద మోటారు పైపు పగిలితే నీరు ఎంతో పైకి ఎగిసిపడినట్లు.. ఈ నీరు అలా భూమి పైకి వస్తున్నాయి.
దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు. దీనిని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ ట్వీట్ చేశారు. ‘నేడు ఎడారి కూడా నీట మునిగింది’ అంటూ ఆయన పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వీహెచ్‌పీ కార్యకర్త పొలంలో బోరుబావి వేస్తుండగా నీటి ప్రవాహం పైకి వచ్చిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
జైసల్మేర్ ఎడారిలో అంతరించిపోయిన పురాతన తల్లి సర్వసతి నదియే ఈ ప్రవాహ ఉధృతికి కారణం అంటూ వినోద్ బన్సల్ తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.
आज रेगिस्तान भी हुआ जलमग्न…
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) December 28, 2024
राजस्थान में जैसलमेर जिले के मोहनगढ़ कस्बे में विहिप कार्यकर्ता विक्रमसिंह जी के खेत में बोरवेल खोदते समय धरती से फूटा जलधारा का प्रवाह..
स्मरण रहे कि प्राचीन विलुप्त मां सरस्वती नदी का प्रवाह मार्ग रहा है जैसलमेर का मरुस्थल।#जलमग्न_रेगिस्तान… pic.twitter.com/UOSoGND5EJ