విశాల్ అచ్చతెలుగు అబ్బాయి. వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్.. అక్కడే తన కెరీర్ ను మొదలుపెట్టి తమిళ్ హీరోగా మారాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టాడు. అయితే బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడీ స్టార్ హీరో. అలాగే వేదికపై వణుకుతూ మాట్లాడారు. దీంతో అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మదగజరాజ సినిమా ఈవెంట్ పూర్తయిన వెంటనే అతను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
ఈ మేరకు అపోలో ఆస్పత్రి వైద్యులు విశాల్ హెల్త్ బులెటిన్ ను కూడా రిలీజ్ చేశారు. ‘ప్రస్తుతం విశాల్ ఒక వైరల్ ఫీవర్ తో పోరాడుతున్నారు. అతనికి చికిత్స అందిస్తున్నాం. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు విశాల్ లేటెస్ట్ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ విశాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. కాగా 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. సంతానం, సోనూసూద్ కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. కానీ అక్కడ అతనిని చూసి అందరూ షాక్ తిన్నారు. అదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రమోషన్స్‌కు హాజరై.. సినిమా పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పిన విశాల్ కమిట్మెంట్ను అందరూ ప్రశంసిస్తున్నారు.
Actor #Vishal 🥹❤️❤️
— Official CinemaUpdates (@OCinemaupdates) January 5, 2025
Though he is suffering from high fever, he came to promote his film #MadhaGajaRaja …
pic.twitter.com/4LrLpQmiEh