హీరో విశాల్ కి స్మెల్, టేస్ట్ కూడా తెలియడం లేదా..? ట్రీట్ మెంట్ చేస్తున్నా కూడా..?

divyaamedia@gmail.com
2 Min Read

తొలినాళ్లలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, విశాల్ తొలి చిత్రం విజయవంతమైంది. ‘సండకోజి’, ‘తిమిరు’, ‘శివప్పతిగారం’, ‘తామిరభరణి’, ‘మలైకోట్టై’, ‘సత్యం’ వంటి చిత్రాలు ఆయనను ప్రముఖ నటుడిగా నిలబెట్టాయి. యాక్షన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, బాల ‘అవన్ ఇవాన్’లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు. అయితే ఇక రీసెంట్ గా ఆయన ‘ మదగదరాజ ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ ఈవెంట్లో ఆయన చాలావరకు వణుకుతూ, నడవలేక నడుస్తున్న పరిస్థితిని ప్రతి ఒక్కరు గమనించారు.

మరి అతను అలా ఎందుకు అయిపోయాడు. దానివల్లే ఆయన ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన ‘వాడు వీడు’ సినిమా సమయంలో డూప్ లేకుండా చెట్టు మీద నుంచి దూకడం వల్ల అతని తలకు బలమైన దెబ్బ తగిలింది. దానివల్ల అతని బ్రెయిన్ లో ఉన్న నరాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయి. దానివల్లే ఆయన సరిగ్గా నడవలేక పోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అతనికి స్మెల్, టేస్ట్ లేకుండా పోయాయట. అలాగే ఆయనకు విపరీతమైన తలనొప్పి కూడా వస్తుందట.

మరి ఏది ఏమైనా కూడా ఆయన దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. కాబట్టి తొందర్లోనే ఆయన కోలుకొని మరికొన్ని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో విశాల్ ను టార్గెట్ చేసి కొంతమంది హీరోలు, రాజకీయ నాయకులు అతన్ని తొక్కేయాలనే విషయం మనకు తెలిసిందే. అయితే అతన్ని తొక్కేయాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేశారు. ఇక ఒక నటిమని విశాల్ తనకి అవకాశం ఇస్తానని చెప్పి తనను వాడుకున్నాడు అంటూ పెను సంచలనాలను సృష్టించే కామెంట్లు చేయడంతో అనీషా రెడ్డి తో పెళ్లి దాకా వచ్చిన ఆయన వ్యవహారం ఆగిపోయిందని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు.

మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం విశాల్ పరిస్థితి ఇలా ఉంది. ఇక మొత్తానికైతే అటు రాజకీయ నాయకులు ఇటు నటీనటులు అందరూ అతన్ని చాలావరకు తొక్కేసే ప్రయత్నం అయితే చేశారు. దానివల్లే ఆయన సినిమా రంగం లో గాని, రాజకీయంగా గానీ అతను కోలుకోలేకుండా పోతున్నాడని మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *