విశాల్ బాగా సన్నబడంతో పాటు మాట్లాడేటప్పుడు వణుకుతూ కూడా కన్పించాడు.దీంతో విశాల్ కి పెద్ద వ్యాధి సోకిందని కొందరు,లేదు లేదు లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల అలా మారిపోయాడంటూ మరొకొందరు ఇలా ఎవరకి తోచిన విధంగా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇదివరకే విశాల్ ఆరోగ్య పరిస్థితి పై నటి ఖుష్బూ స్పందించిన సంగతి తెలిసిందే. విశాల్ వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నారని ఆమె వెల్లడించింది. తాజాగా హీరో జయం రవి స్పందించారు.
తన తదుపరి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. విశాల్ త్వరలోనే తిరిగి వస్తారని అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. “విశాల్ మంచి మనసు ఉన్న వ్యక్తి. ఎంతోమందికి సేవ చేశారు. ప్రస్తుతం అతడికి గడ్డుకాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. సింహంలా గర్జిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు. ఇక విశాల్ ఆరోగ్యం గురించి అతడి మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వైరల్ ఫీవర్, తీవ్రమైన నొప్పులతో ఆయన ఇబ్బందిపడుతున్నారని.. వైద్యులు ఆయనకు విశ్రాంతి సూచించారని తెలిపారు. అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన ఆరోజు ఈవెంట్ కు హాజరయ్యారని… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. విశాల్ హీరోగా డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించిన సినిమా మదగజరాజు. అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదలవుతుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఈ మూవీ వేడుకలో పాల్గొన్నారు విశాల్. సినిమా గురించి విశాల్ మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణుకుతూ కనిపించాయి. నడవడానికి, చూడడానికి, మాట్లాడేందుకు సైతం ఇబ్బందిపడ్డారు.