హీరో విశాల్.. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్ తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్… ప్రస్తుతం ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. తను చేసిన ‘పందెంకోడి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడంతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ల రోజుల కింది వరకు కూడా చాలా ఎనర్జీతో కనిపించిన ఈయన సడన్‌గా కనీసం నిలబడలేనంత వీక్ అయిపోయారు.
విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు అందుకే అలా అయ్యారు అని అంటున్నారు డాక్టర్స్. ఇదిలా ఉంటే విశాల్ గతంలో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం గుర్తుందా.? కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. విశాల్ 2019 ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆమె పేరు అనిషా. ఆమె విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. విశాల్ ఈ అమ్మడితో 2019 మర్చి 16న ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వీరి వివాహం జరగలేదు. వీరి విహహం ఆగిపోవడానికి కారణం ఏంటి అన్నది కూడా బయటకు రాలేదు.
ఆ తర్వాత వీరి వివాహం గురించి ఎక్కడా ఎలాంటి వార్తలు రాలేదు. అనిషా కూడా తన సినిమాలతో బిజీ అయిపొయింది. ఆ మధ్య ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలువినిపించాయి. ఇక అనిషా చివరిగా సెహరి సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదానికి వైల్డ్ లలైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. సోషల్ మీడియా మొత్తం ఆ ఫొటోలే ఉంటాయి.