అధ్భుతమైన అందాలు కల్గిన ఈ క్యూట్ బ్యూటీ విరాట్ కోహ్లీకి మరదలు, ఆయన భార్య అనుష్క శర్మకు చెల్లెలు వరుస అవుతుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సన్నని బ్లాక్ కలర్ జారే చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. కన్నుగీటుతూ మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రుహానీ శర్మ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అనుష్క శర్మ, విరాట్ వివాహం 2017లో ఘనంగా జరగ్గా.. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అప్పటివరకు హిందీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్గా ఉన్న అనుష్క.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.
బీటౌన్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అనుష్క.. ఇప్పటికీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. అయితే మీకు తెలుసా.. అనుష్క చెల్లెలు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగులో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె విరాట్ కోహ్లీకి మరదలు కూడా. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే.. తెలుగులో మంచి పాలోయింగ్ సొంతం చేసుకుంది టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు.
ఆమె మరెవరో కాదు.. రుహానీ శర్మ. తమిళ చిత్రపరిశ్రమలో నటిగా తన సినీప్రయాణం స్టార్ట్ చేసిన రుహానీ.. ఆ తర్వాత చి..ల.. సౌ మూవీతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో మెప్పించింది. ఆ తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక గతేడాది విక్టరీ వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ నటించింది. అయితే అందం, అభినయంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు సరైన క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగులో వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఇప్పటివరకు స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.
కొన్నాళ్లుగా ఈ బ్యూటీ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు అవుతానని ఎప్పుడూ బయట చెప్పలేదు రుహానీ. తనకు విరాట్ బావ అవుతాడని.. తనతో ఎంతో సరదాగా ఉంటాడని గతంలో సైంధవ్ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం రుహానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.