తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి టపాసులు పేల్చి వైరల్ అవ్వాలని చూశాడు. చివరికి ఏమైందో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలాగైనా సోషల్ మీడియాలో వైరల్ అవ్కాలనే ఉద్దేశంతో విచిత్ర విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు. టపాసులు పేల్చి నెటిజన్లు దృష్టిని ఆకర్షించాలని చూశాడు.
ఇందుకు తగ్గట్టుగా ఓ బాంబ్ తీసుకుని ఇంటి పైకి వెళ్లాడు. స్టాండ్‌పై కెమెరా పెట్టి.. ఎదురుగా బాంబ్ పేల్చేందుకు సిద్ధమయ్యాడు. బాంబుకు నిప్పు వెలిగించి, తర్వాత దానిపై గ్లాసు మూశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. టపాసు పేలే సమయంలో సరిగ్గా దానిపైన వెనక్కు తిరిగి నిలబడ్డాడు.
టపాసు పేలగానే ఆ పేలుడు దాటికి గ్లాసు ఎగిరి అతడి బ్యాక్‌కు గట్టిగా తాకింది. దెబ్బకు అతడికి చుక్కలు కనిపించాయి. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ చాలా సేపు ఇబ్బంది పడ్డాడు. ఇలా టపాసును వినూత్నంగా పేల్చి నెట్టింట వైరల్‌గా మారాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
”వైరల్ అవ్వాలని చూస్తే.. బ్యాక్ మోత మోగిందిగా”.. అంటూ కొందరు, ”ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో అయిందే”.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లు, 7లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
😭😭?
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 12, 2024
pic.twitter.com/jTKYa4o6f6