కిడ్నాపర్‌ నుంచి అమ్మ దగ్గరకు వెళ్లనని ఏడుస్తున్న బాలుడు, దీంతో బలవంతంగా అమ్మ దగ్గరకు చేర్చిన పోలీసులు..!

divyaamedia@gmail.com
2 Min Read

నెలల వయస్సులో ఉన్నప్పుడు కిడ్నాపర్ చెంతకు చేరడంతో, తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చాహరే పెంచడంతో ఆ చిన్నారి బాలుడు పృథ్వి కిడ్నాపర్ పై మమకారం పెంచుకున్నాడు. కిడ్నాపర్‌ను వీడేందుకు ససేమిరా అంటూ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనంటూ బోరున విలపించాడు. అదే సమయంలో తనను వీడుతున్న బాధతోనో బిడ్డను అప్పగించే క్రమంలో ఆ కిడ్నాపర్‌ కళ్లలో కూడా కన్నీటి సుడులు తిరిగాయి. అయితే జూన్ 14, 2023న, బాలుడు అపహరణ గురించిన సమాచారం పోలీసులకు అందింది.

అప్పటికి ఆ చిన్నారి బాలుడి వయసు 11 నెలలు మాత్రమే. నిందితుడిని తనూజ్ చాహర్‌గా గుర్తించారు. యూపీ పోలీస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తనూజ్ బాలుడి కిడ్నప్ విషయంపై సస్పెన్షన్‌కు గురయ్యాడు. తనూజ్ తన సహచరులతో కలిసి 11 నెలల చిన్నారి బాలుడిని కిడ్నాప్ చేశాడు. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు పలు చోట్ల దాడులు చేశారు. దాదాపు 14 నెలల తర్వాత ఆగస్టు 27న పోలీసులు నిందితుడిని అలీగఢ్‌ నుంచి అరెస్టు చేసి జైపూర్‌ తీసుకొచ్చారు.

నిందితుడు బాలుడిని అపహరించినప్పటికీ ఎలాంటి హాని చేయలేదు. పైగా పృథ్వీ తన బిడ్డ అని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడు బాలుడి తల్లిని ఎలాగైనా తన దగ్గర వద్దే ఉంచుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నప్ అయిన బాలుడు దొరికిన సమాచారం అందిన చిన్నారి తల్లిదండ్రులు అతడిని తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్‌కు రాగా.. కిడ్నాపర్ తనూజ్‌ను కౌగిలించుకుని ఏడ్చాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళడానికి నిరాకరించాడు .

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *