కేఏ పాల్ .. ఇక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. వరదల కారణంగా ఇన్ని లక్షల మంది ఇళ్లు కోల్పోతారని అనుకోలేదని వెల్లడించారు. దాదాపు 2,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అనుకుంటున్నారని, దీనిపై స్పష్టత లేదని తెలిపారు. ఏదేమైనా, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారని, కానీ ఆయన వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కేఏ పాల్ అభిప్రాయపడ్డారు. అయితే ఊహించని విధంగా నీరు ఇళ్లల్లోకి చేరడంతో.. హుటా హుటిన ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు స్థానికులు.
మూడు రోజుల నుండి వరద నీటిలో చిక్కుకున్నారు. తిండి, నీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్దులు పరిస్థితి వర్ణనాతీతం. వరదల్లో బెజవాడ నగరం చిక్కుకున్న రోజు నుండే సహాయక చర్యలు ముమ్మరంగా కొససాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ దళాలు రెస్య్కూ ఆపరేషన్ చేపడుతున్నాయి. అలాగే తిండి, నీరు లేక అవస్థలు పడుతున్న వాళ్లకు హెలికాఫ్టర్ల ద్వారా సాయం అందిస్తున్నారు.
బాధిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసానిస్తున్నారు రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు. తాజాగా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా విజయవాడలో పర్యటించారు. వరద ముప్పు ప్రాంతంలో స్థానికుల సాయంతో పడవలో ప్రయాణించిన ఆయన.. అక్కడ పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వెంట కొన్ని ఆహార పొట్లాలను తీసుకెళ్లి బాధితులకు అందజేశారు. మూడు రోజులుగా నగర వాసులు నీటిలో చిక్కుకుపోయారని, కొంత మంది ఆహారం అందుతుందని, మరికొంత మందికి ఫుడ్ అందట్లేదని అన్నారు.
సుమారు 4 లక్షల మంది నీరు, తిండి లేక ఇబ్బందికి గురౌతున్నారని, వారికి తక్షణ సాయం అందించాలని, చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇలాంటి నష్టం మున్ముందు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కేఎ పాల్.