.”రెజ్లింగ్ నాతో మ్యాచ్ గెలిచింది, నేను ఓడిపోయాను. మీ కలలు, నా ధైర్యం చెదిరిపోయాయి. నాకు ఇప్పుడు బలం లేదు. కుస్తీకి గుడ్ బై 2001-2024. నేను మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్షమించండి” అంటూ ఎక్స్ లో వినేష్ ఫోగట్ పోస్ట్ చేశారు. అయితే భారత రెజ్లర్ వినేష్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ‘నాపై రెజ్లింగ్ గెలిచింది. నేను ఓడిపోయాను. నా ధైర్యం ఓడిపోయింది. నాకు ఇంక బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024’ అని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా అధిక బరువు కారణంగా ఫొగట్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. దీంతో చివరి క్షణంలో ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయారు.
అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఫొగాట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. అయితే వినేష్ ఫొగాట్ చేసిన ఫిర్యాదులో తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని పేర్కొన్నట్లు సమాచారం.
దీనిపై ఆ ఆర్భిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇంతలోనే వినేష్ రెజ్లింగ్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో అనుమానులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏